విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు, ఉ పాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను తీ ర్చేందుకు అధికారులు చేస్తున్న కృషి ఫలించ డం లేదు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనపు తరగతి గదులు మంజూరు చేయగా, వాటి నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
2012-13 విద్యాసంవత్సరంలో రాజీవ్ విద్యామిషన్(ఆర్‌వీఎం) రాష్ట్ర ప్రాజెక్టు అధికారులు జిల్లాకు 934 అదనపు గదుల నిర్మాణానికి మం జూరు ఇచ్చారు. ఒక్కో గదికి రూ.5.30లక్షల చొప్పున రూ.52.46కోట్లు మంజూరు చేశారు కూడా. నిధుల మంజూరైన ఆరు నెలల్లోనే గదుల నిర్మాణం పూర్తిచేయాలనే ఆదేశాలు ఉండగా, ఏడాది పూర్తయినా అరకొరగానే గదుల నిర్మాణం పూర్తయింది. ఫలితంగా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు లేక వరండాలతో పాటు ఒక్కో గదిలో రెండు తరగతులకు బోధన చేస్తున్నారు.
నిర్మాణ దశలో 360 గదులు
జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలల్లో 934 అదనపు గదులు మంజూరుకాగా, ఇందులో ఇప్ప టి వరకు 519 గదుల నిర్మాణాలే పూర్తయ్యా యి. ఇక 360 గదుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కాగా, ఆర్థిక సంవత్సరం ముగింపు అయిన మార్చి 31వ తేదీ సమీపిస్తుండడంతో అప్పటిలోగా గదుల నిర్మాణం పూర్తిచేయకపో తే నిధులు వెనక్కి మళ్లే ప్రమాదముంది. దీం తో మార్చి 31వ తేదీలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని ఆర్‌వీఎం అధికారులు ఇటీవల ఎస్‌ఎంసీలకు నోటీసులు జారీ చేశారు.
ఇప్పటి వరకు పారంభించనివి 55
పలు పాఠశాలలకు మంజూరైన 55 అదనపు గదుల నిర్మాణం ఇంతవరకు ప్రారంభమే కాలే దు. ఇందులో వరంగల్ అర్బన్‌లోని వివిధ పాఠశాలల్లో సరిపడా స్థలం లేకపోవడంతో 24 గదులకు సంబంధించి సందిగ్దత నెలకొంది. ఈమేరకు అవసరమున్న వేరే పాఠశాలలకు వీటిని కేటాయించాలని జిల్లా అధికారులు తా జాగా ఆర్‌వీఎం రాష్ట్ర పీడీకి ప్రతిపాదించారు.
మచిలీబజార్ పాఠశాలలది మరో కథ..
హన్మకొండలోని మచిలీబజార్ పీఎస్, హై స్కూల్ విద్యార్థుల కోసం ఆరు గదులే మంజూ రై ఏడాది గడిచినా స్థలం లేక నిర్మాణాలు ప్రా రంభం కాలేదు. మచిలీబజార్‌లోని అద్దె భవనంలో ఈ పాఠశాల కొన్నాళ్లు కొనసాగగా, అక్కడి నుంచి మునిసిపల్ గెస్ట్‌హౌస్‌కు సంబంధించి పురాత గదుల్లోకి తరలించారు. ఉర్దూ, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇక్కడ బోధన సాగగా, గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని చెబుతూ కూల్చివేశారు.
ఆ సమయంలో తమ కు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా.. వేయిస్థంబాల గుడి ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలకు మచిలీబజార్ హైస్కూల్ ను, పీఎస్‌ను హన్మకొండలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలకు షిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మచిలీబజార్ పాఠశాలకు మంజూరైన అదన పు గదుల నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థ లం చూపాలని ఆర్‌వీఎం అధికారులు నాలుగు నెలల క్రితం కలెక్టర్‌ను కోరినా స్పందన రాలే దు.
దీంతో ఈ గదుల నిర్మాణానికి మంజూరైన నిధులను మరో పాఠశాలకు కేటాయించాలనే యోచనకు అధికారులు వచ్చారు. ఇక జూబ్లీ మార్కెట్, లంబాడీ తండా, పోలీస్ గ్రౌండ్ పీ ఎస్‌లతో పాటు కొత్తూరు హైస్కూల్, మాసుం అలీ, బాంబే ఆర్‌ఎం పీఎస్, నానామియా తో ట, పీఎస్‌టీ కుంట, సీఆర్ నగర్, కీర్తినగర్ పీ ఎస్‌లకు మంజూరైన గదుల నిర్మాణం కూడా స్థల సమస్యతో ప్రా రంభం కాలేదు. వెంటనే పనులు ప్రారంభించకపోయినా.. ఆర్‌వీఎం అ ధికారులు ప్రతిపాదించినట్లుగా ఈ నిధులను వేరేచోటకు మళ్లిం చినా ఆయా పాఠశాలలకు అదనపు గదులు మళ్లీ ఎప్పుడు మంజూరవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఇరుకిరుకుగా ఇంకెన్నాళ్లు..?
Published Wed, Jan 22 2014 4:35 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement