
ఐకేపీ మహిళలు కలెక్టరేట్ ముట్టడి
ఏలూరు: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ (ఇందిరా క్రాంతి పథకం)మహిళలు సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ను ముట్టడించారు. ఓ మహిళా పోలీస్ని చితకబాదారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గేటు బయట బైఠాయించిన మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో వచ్చిన మహిళలను అదుపు చేయడం పోలీసులకు కష్టమైపోయింది.
15 నెలలుగా తమకు జీతాలు లేవని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని చెప్పారు. తమ జీతాలు తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
**