శ్రీకాకుళం టౌన్:కోటబొమ్మాళి మండలం నారాయణవలసలో ప్రతి గురువారం నిర్వహించే సంత మూగ జీవాల రవాణాకు కేరాఫ్‌గా మారినట్టు జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కింజరాపు ఎర్రన్నాయుడు సుమారు 60 ఎకరాల్లో ఉన్న సంతలో మౌలిక వసతులు కల్పించారు. పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న ఈ సంత వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. కోట్ల రూపాయలతో భవనాలను నిర్మించడంతోపాటు, ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు. రైతులు సేదతీరడానికి షెడ్లు, గోదాంలను ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటినీ ఇప్పుడు రైతుల అవసరాలకు కాకుండా పశువుల అక్రమ రవాణా కేంద్రంగా కొంతమంది అక్రమార్కులు మార్చేశారు.
తరలింపు ఇలా..
నారాయణవలస సంత నుంచి పశువులను కంటెయినర్లకు లోడ్ చేస్తున్నారు. వాటిలో గేదెలను, ఎద్దులను హైదరాబాద్, పశ్చిమబంగ ప్రాంతాలకు తరలిస్తుంటే.. పాడి ఆవులను మాత్రం బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారు. పెద్దెత్తున సాగే ఈ వ్యవహారంలో సంత నిర్వాహకులే ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే కంటెయినర్ల సిబ్బందితోపాటు అక్కడి నుంచి వచ్చే కబేళా వ్యాపారులకు సంతలో ఉన్న గొదాంలే విశ్రాంతి గదులుగా వాడుకునేందుకు ఇస్తున్నారు. అలాగే రైతు అవసరాలకు నిర్మించిన ప్లాట్ ఫారాలను పశువులను కంటెయినర్లకు, లారీలకు ఎక్కించడానికి ఉపయోగిస్తున్నారు. సరిహద్దులు దాటాలంటే అన్నిశాఖల క్లియరెన్సు తప్పనిసరి. పశువైద్యాధికారులు పశువులను కబేళాలకు తరలించడానికి అనుమతిపత్రాలు ఇవ్వాలి. వాటిని సంత నిర్వహకులే సొంతంగా తయారు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నారుు.
కానరాని నిబంధనలు
పశువుల రవాణాలో కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒక్కో లారీలో సుమారు 16 పశువులు మాత్రమే ఎక్కించా. కాని 60 నుంచి 70 ఎక్కిస్తుండడంతో గాయాలపాలవుతున్నాయి. వాటిని సరిహద్దులను దాటించడానికి ముడుపులు చెల్లిస్తుండడంతో ఈ ఘోరాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
కంటెయినర్‌కు రూ.2 వేలు ఆశీలు
పశువుల అక్రమరవాణాకు వినియోగించే కంటెరుునర్ లోడ్ చేసేందుకు సంత నిర్వహకులు అశీలు రూపంలో రూ.2 వేలు వసూలు చేస్తారు. వీటితో పాటు కంటెరుునర్ సిబ్బంది, వ్యాపారుల విడిది అవసరాలకు పశువులకు గడ్డి,నీరు, దాణా పెట్టేందుకు అదనంగా మరో రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. అలాగే ఇతరత్రా పత్రాలకు అదనంగా మరో రూ. పది వేలు వరకూ వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఒక కంటెయినర్ నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేలు వస్తుండడంతో సంత నిర్వహకులు పశువుల అక్రమ రవాణాకు తెగబడుతున్నారు.
ఈ వ్యాపారం ఊపందుకోవడంతో అధికార పార్టీ పెద్దల జోక్యం మొదలైంది. మూగజీవాల రవాణాలో కొంతమంది నేతలు కూడా పాపం పంచుకుంటున్నారు. అధికార పార్టీ పెద్దల అండదండలు ఉండడంతో అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. చివరకు సంతను పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టాల్సిన పశుసంవర్థక శాఖ, పోలీసుశాఖ లు కూడా కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు.
అక్రమరవాణాలో ప్రభుత్వ ఉద్యోగి!
నారాయణవలస సంత నిర్వహణతోపాటు పశువుల అక్రమ రవాణాలో ఓ ఉపాధ్యాయుడు సూత్రధారిగా వ్యవహరిస్తున్నానివిశ్వహిందూ పరిషత్ నాయకులతో పాటు బ్లూక్రాస్ సొసైటీ నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదులు అందారుు. అరుుతే సంబంధిత ఉద్యోగిపై ఎలాంటి చర్యలు లేవు.
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పశువులను తరలించే సమయంలో ఆరు కంటే ఎక్కువలోడ్ చేస్తే సెక్షన్ 9060 ప్రకారం రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గోవధ నిషేధచట్టం 1977 అమలులో ఉన్న కారణంగా చట్టరీత్యా ఏడేళ్లు జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది. పోలీసు, రవాణాశాఖలు సమర్థవంతంగా అక్రమ పశురవాణాను అరికట్టాలి. దాడు సమయంలో దొరికిన పశువులను అప్పగిస్తే వాటి సంరక్షణ బాధ్యత పశుసంవర్థక శాఖ చూస్తుంది.
- డాక్టర్ నాగన్న, పశుసంవర్థక శాఖ జేడీ
కఠినమైన చర్యలు తప్పవు
నారాయణవలస సంత నుంచి అనధికారికంగా పశువుల అక్రమరవాణా సాగుతున్న విషయం తమ దృష్టికి రాలేదు. పశు సంవర్ధక శాఖ అధికారులను ఈ ఘటనపై పరిశీలన చేయూలని సూచిస్తాం. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని రవాణాశాఖ అధికారులను ఆదేశిస్తాసం. పశువులను రైతులే కొనుగోలు చేసుకుని తీసుకెళ్తున్నారా? వ్యాపారులు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారా అన్నది పరిశీలించి చర్యలు తీసుకోవాలి. సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో వీటిని అరికడతాం.
-పి.లక్ష్మీనృసింహం, జిల్లా కలెక్టర్
మూగ వేదన!
Published Fri, May 13 2016 12:25 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement