Kinjarapu Yerran Naidu
-
కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ నాయకులు ప్రేమగా రాము అని పిలుచుకునే రామ్మోహన్ నాయుడిని 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు దక్కించుకున్న రామ్మోహన్నాయుడు.. జిల్లాలో ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల వయస్సులో.. ఎంపీ రామ్మోహన్నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 37 ఏళ్ల వయస్సులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తనయుడు 36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. దీంతో జిల్లా నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, ఉమ్మడి శ్రీ కాకుళం జిల్లాలోని పాలకొండ, ఉణుకూరు నియోజకవర్గాలు కలిసి ఉన్న పార్వతీపురం ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా చరణ్‌సింగ్(1979–80), మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(2011–2014)లో కేంద్ర ఉక్కు, గనుల, బొగ్గు శా ఖా మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు పాతపట్నం లోకసభ నుంచి గెలిచిన వీవీ గిరి కూడా ఆ తర్వాత ఎన్నికైన సందర్భంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.కుటుంబ నేపథ్యం.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్నాయుడు జని్మంచారు. ఈయనకు సోదరి భవానీ ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను 2017లో వివాహమాడారు. వీరికి నిహిర అన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం రామ్మోహన్నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో 4,5వ తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్లో చదువుకున్నారు. 1996 లో ఎర్రన్నాయుడు లోకసభకు ఎన్నికవ్వడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కుటుంబమంతా షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్మోహన్నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అక్కడే ఉన్న లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీలో ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మా ర్కెటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉద్యోగం మానేసి శ్రీకాకుళం వచ్చేశారు. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 36 ఏళ్ల వయస్సులో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
హ్యాట్రిక్ విజయాలు వీరి సొంతం
సాక్షి, శ్రీకాకుళం : ఆటలోనైనా.. ఎన్నికల్లో అయినా హ్యాట్రిక్ విజయాలు సాధించడం గొప్ప విషయమే. క్రికెట్ ఆటలోనే ఎక్కువ హ్యాట్రిక్ ప్రస్తావన వస్తుంది. వరుసగా మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అని బౌలర్‌ను ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటిది ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తే.. అంతకన్నా గొప్ప విషయమే. అందరికీ ఇది సాధ్యం కాదు. అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటూ.. వారి మెప్పు పొందిన వారికే ఇలాంటి రికార్డు దక్కుతుంది. ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వారు అరుదుగా ఉంటారు. ఆ ఖ్యాతి దక్కించుకున్నవారు శ్రీకాకుళం జిల్లాలో 17 మంది ఉన్నారు. ఆనాటి తరం నాయకులు గౌతులచ్చన్న, లుకలాపు లక్ష్మణదాసు, పోతుల గున్నయ్య, శిమ్మ జగన్నాథం, తమ్మినేని పాపారావు, కింజరాపు ఎర్రన్నాయుడు, నిమ్మక గోపాలరావులతో పాటు ఈ తరంలో కూడా చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా స్పీకరుగా గుర్తింపు పొందిన కావలి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి వరుసగా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంలో ఓటమి పొందారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి శిమ్మ జగన్నాథం 1955 నుంచి 1972 వరకూ వరుసగా గెలుపొందారు. ధర్మాన కృష్ణదాసు 2004, 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం పొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. శ్రీకాకుళం నియోజకర్గం నుంచి గుండ అప్పలసూర్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు వరుస విజ యాలు సాధించారు. అప్పలసూర్యనారాయణ 1985 నుంచి 1999 వరకూ వరుస ఎన్నికల్లో విజయం సాధించా రు. 2004 నుంచి ఆయనకు అపజయాలు పలకరిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. నరసన్నపేట నుంచి 1999లో ప్రత్యర్థి బగ్గు లక్ష్మణరావుపై గెలవగా, 2004, 09 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి గుండ అప్పలసూర్యనారయణపై విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి కలమట మోహనరావు ఐదుసార్లు గెలుపొందారు. 1978లో గెలిచి అనంతరం ఒకసారి ఓటమి పొందారు. తరువాత ఎన్నికల్లో 89, 94, 99, 2004ల్లో వరుసగా విజయం సాధించి ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. లుకలావు లక్ష్మణదాసు ఐదుసార్లు గెలుపొందగా పాతపట్నం (ద్విసభ్య) నియోజకవర్గం నుంచి 1952, 55, 62ల్లో గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. జిల్లాలో మొదట హ్యాట్రిక్ విజయం సాధించింది ఈయనే.. ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారాం 1998, 85,ఎన్నికల్లో గెలిచి 89లో ఓటమి పొందారు. 1991 లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావును ఓడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన తమ్మినేని 1994, 99 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన పోతుల గున్నయ్య 1952లో చీపురుపల్లి, 55లో పాతపట్నం, 62లో కొత్తూరు, 67లో పాతపట్నం నియోజకవర్గాల నుంచి వరుసగా గెలుపొందారు. కింజరాపు ఎర్రన్నాయుడు 1983 నుంచి 94 వరకూ వరుసగా విజయాలు సాధించారు. 83, 85 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 89లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటిచేసి ఘనవిజయం నమోదు చేశారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిచ్చంద్రపురం నుంచి అరంగేట్రం చేసిన కింజరాపు అచ్చన్నాయుడు 99, 2004, సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇచ్ఛాపురం నుంచి ఎంవీ కృష్ణారావు 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. కొత్తూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి నిమ్మక గోపాలరావు నాలుగుసార్లు గెలిచారు. 1972లో రాజకీయంలో ప్రవేశించిన ఆయన 1989, 94, 99 సంవత్సరం ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అంతకు ముందు 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పొందారు. కిమిడి కళా వెంకటరావు కూడా 1983, 85, 89 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. పూర్వపు నగిరికటకం (ప్రస్తుతం ఆమదాలవలస) నియోజకవర్గం నుంచి తమ్మినేని పాపారావు కూడా హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గౌతు లచ్చన్న సోంపేట నియోజకవర్గం నుంచి ఐదు సార్లు వరుసగా విజయం పొందారు.అలాగే ఈయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ కూడా నాలుగుసార్లు గెలుపొందారు. -
మూగ వేదన!
శ్రీకాకుళం టౌన్:కోటబొమ్మాళి మండలం నారాయణవలసలో ప్రతి గురువారం నిర్వహించే సంత మూగ జీవాల రవాణాకు కేరాఫ్‌గా మారినట్టు జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కింజరాపు ఎర్రన్నాయుడు సుమారు 60 ఎకరాల్లో ఉన్న సంతలో మౌలిక వసతులు కల్పించారు. పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు మధ్యలో ఉన్న ఈ సంత వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. కోట్ల రూపాయలతో భవనాలను నిర్మించడంతోపాటు, ప్లాట్‌ఫారాలను ఏర్పాటు చేశారు. రైతులు సేదతీరడానికి షెడ్లు, గోదాంలను ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటినీ ఇప్పుడు రైతుల అవసరాలకు కాకుండా పశువుల అక్రమ రవాణా కేంద్రంగా కొంతమంది అక్రమార్కులు మార్చేశారు. తరలింపు ఇలా.. నారాయణవలస సంత నుంచి పశువులను కంటెయినర్లకు లోడ్ చేస్తున్నారు. వాటిలో గేదెలను, ఎద్దులను హైదరాబాద్, పశ్చిమబంగ ప్రాంతాలకు తరలిస్తుంటే.. పాడి ఆవులను మాత్రం బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారు. పెద్దెత్తున సాగే ఈ వ్యవహారంలో సంత నిర్వాహకులే ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చే కంటెయినర్ల సిబ్బందితోపాటు అక్కడి నుంచి వచ్చే కబేళా వ్యాపారులకు సంతలో ఉన్న గొదాంలే విశ్రాంతి గదులుగా వాడుకునేందుకు ఇస్తున్నారు. అలాగే రైతు అవసరాలకు నిర్మించిన ప్లాట్ ఫారాలను పశువులను కంటెయినర్లకు, లారీలకు ఎక్కించడానికి ఉపయోగిస్తున్నారు. సరిహద్దులు దాటాలంటే అన్నిశాఖల క్లియరెన్సు తప్పనిసరి. పశువైద్యాధికారులు పశువులను కబేళాలకు తరలించడానికి అనుమతిపత్రాలు ఇవ్వాలి. వాటిని సంత నిర్వహకులే సొంతంగా తయారు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నారుు. కానరాని నిబంధనలు పశువుల రవాణాలో కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒక్కో లారీలో సుమారు 16 పశువులు మాత్రమే ఎక్కించా. కాని 60 నుంచి 70 ఎక్కిస్తుండడంతో గాయాలపాలవుతున్నాయి. వాటిని సరిహద్దులను దాటించడానికి ముడుపులు చెల్లిస్తుండడంతో ఈ ఘోరాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కంటెయినర్‌కు రూ.2 వేలు ఆశీలు పశువుల అక్రమరవాణాకు వినియోగించే కంటెరుునర్ లోడ్ చేసేందుకు సంత నిర్వహకులు అశీలు రూపంలో రూ.2 వేలు వసూలు చేస్తారు. వీటితో పాటు కంటెరుునర్ సిబ్బంది, వ్యాపారుల విడిది అవసరాలకు పశువులకు గడ్డి,నీరు, దాణా పెట్టేందుకు అదనంగా మరో రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. అలాగే ఇతరత్రా పత్రాలకు అదనంగా మరో రూ. పది వేలు వరకూ వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఒక కంటెయినర్ నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేలు వస్తుండడంతో సంత నిర్వహకులు పశువుల అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఈ వ్యాపారం ఊపందుకోవడంతో అధికార పార్టీ పెద్దల జోక్యం మొదలైంది. మూగజీవాల రవాణాలో కొంతమంది నేతలు కూడా పాపం పంచుకుంటున్నారు. అధికార పార్టీ పెద్దల అండదండలు ఉండడంతో అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. చివరకు సంతను పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టాల్సిన పశుసంవర్థక శాఖ, పోలీసుశాఖ లు కూడా కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. అక్రమరవాణాలో ప్రభుత్వ ఉద్యోగి! నారాయణవలస సంత నిర్వహణతోపాటు పశువుల అక్రమ రవాణాలో ఓ ఉపాధ్యాయుడు సూత్రధారిగా వ్యవహరిస్తున్నానివిశ్వహిందూ పరిషత్ నాయకులతో పాటు బ్లూక్రాస్ సొసైటీ నుంచి కలెక్టర్‌కు ఫిర్యాదులు అందారుు. అరుుతే సంబంధిత ఉద్యోగిపై ఎలాంటి చర్యలు లేవు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పశువులను తరలించే సమయంలో ఆరు కంటే ఎక్కువలోడ్ చేస్తే సెక్షన్ 9060 ప్రకారం రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గోవధ నిషేధచట్టం 1977 అమలులో ఉన్న కారణంగా చట్టరీత్యా ఏడేళ్లు జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది. పోలీసు, రవాణాశాఖలు సమర్థవంతంగా అక్రమ పశురవాణాను అరికట్టాలి. దాడు సమయంలో దొరికిన పశువులను అప్పగిస్తే వాటి సంరక్షణ బాధ్యత పశుసంవర్థక శాఖ చూస్తుంది. - డాక్టర్ నాగన్న, పశుసంవర్థక శాఖ జేడీ కఠినమైన చర్యలు తప్పవు నారాయణవలస సంత నుంచి అనధికారికంగా పశువుల అక్రమరవాణా సాగుతున్న విషయం తమ దృష్టికి రాలేదు. పశు సంవర్ధక శాఖ అధికారులను ఈ ఘటనపై పరిశీలన చేయూలని సూచిస్తాం. ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని రవాణాశాఖ అధికారులను ఆదేశిస్తాసం. పశువులను రైతులే కొనుగోలు చేసుకుని తీసుకెళ్తున్నారా? వ్యాపారులు కొనుగోలు చేసి కబేళాలకు తరలిస్తున్నారా అన్నది పరిశీలించి చర్యలు తీసుకోవాలి. సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో వీటిని అరికడతాం. -పి.లక్ష్మీనృసింహం, జిల్లా కలెక్టర్ -
టీడీపీలో సీన్ రివర్స్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : భాష, యాస, శైలితో జాతీయ స్థాయిలో ప్రత్యేకత చాటుకున్న మాజీ ఎంపీ, దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు అనంతరం తెర పైకి వచ్చిన ఆయన తనయుడు రామ్మోహన్నాయుడును చూసి అంతా వారసుడొచ్చాడనుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ఆదరించారు. ఇటీవలి ఎన్నికల్లోనూ గెలిపించారు. ఆ తర్వాత జరుగుతున్న పరి ణామాలు మాత్రం అసలు వారసుడి వన్నె తగ్గిస్తున్నాయి. ఎర్రన్న కుటుంబ సభ్యులన్న సానుభూతితో ఎంపీగా రామ్మోహన్, టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు గెలిచారు. ఎన్నికల వరకు టీడీపీ వ్యవహారమంతా రామ్మోహన్ కేంద్రంగానే సాగింది. ఆయనే తమ గెలుపు చుక్కాని అని మెజారిటీ అభ్యర్థులు, పార్టీ నాయకులు భావించారు. ఎన్నికల్లో విజయం సాధించి అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో ఎన్నికల వరకు ఉన్న సీన్ కాస్త రివర్స్ అయ్యింది. అధికార కేంద్రం అబ్బాయ్ నుంచి బాబాయ్‌కి బదిలీ అయినట్లు కనిపిస్తోంది. అధికారుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు సహజంగానే మంత్రి అచ్చెన్న చుట్టూ కేంద్రీకృతమవుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. సమీక్షలో రామ్మోహన్ మౌనం జిల్లా అధికారులతో మూడు రోజుల క్రితం జరిగిన సమీక్ష సమావేశంలో ఆద్యంతం అచ్చెన్న హవాయే కనిపించింది. ఎంపీగా రామ్మోహన్ ఈ సమావేశానికి హాజరైనా మౌనంగా కూర్చుండిపోయారు. అచ్చెన్న ప్రభ వెలిగించేందుకు అంతా ప్లాన్ ప్రకారం పక్కాగా జరిగింది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు అసెంబ్లీలో ప్రమాణం చేయకముందే జిల్లా సమీక్ష నిర్వహించడం.. సమీక్ష నిర్వహణ తేదీలు మారడం వెనుక కూడా అచ్చెన్న వ్యూహం ఉందని పార్టీకి చెందిన కొందరు పేర్కొంటున్నారు. సమావేశంలో కూడా ఒక వర్గాన్నే టార్గెట్ చేసుకుని మంత్రి మాట్లాడటం కూడా అనుమానాలు రేపుతోంది. తన ప్రసంగాల ద్వారా జాతీయ స్థాయి నాయకుల్ని ఆకట్టుకున్న రామ్మోహన్ ఈ సమావేశంలో మాత్రం మౌనం దాల్చడం, ఓ ఎంపీగా జిల్లా వాసులకు తాను ఏం చేయదలచుకున్నానో సమీక్ష సమావేశంలో అధికారులకు చెప్పకపోవడంపై టీడీపీలోని ఆయన అభిమానులను నిరాశకు గురి చేసింది. గ్రీవెన్స్‌లోనూ అదే తీరు సహజంగా అధికారులు మంత్రికే ప్రాధాన్యం ఇస్తారు కదా అని సరిపెట్టుకుందామంటే.. ఈ నేతల ఇళ్ల వద్ద నిర్వహిస్తున్న రోజువారీ గ్రీవెన్సులోనూ అదే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంపీని పెద్దగా పట్టించుకోకుండా అందరూ అచ్చెన్న చెంతకు చేరుతుండటం చర్చనీయాంశమవుతోంది. పదేళ్ల తరువాత టీడీపీ అధికారంలోకి రావడం, త్వరలో నామినేటెడ్ సహా అనేక పదవులకు నియామకాలు జరగనున్న నేపథ్యంలో మంత్రిని మచ్చిక చేసుకుంటేనే పదవులు లభిస్తాయని భావిస్తున్న వారు ఆయన్ను కలిసి విన్నపాలు సమర్పిస్తున్నారు. ఈ మేరకు రిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీపై అచ్చెన్న జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ పనులకు సంబంధించి కూడా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అచ్చెన్న వ్యవహార శైలి తెలిసిన తన వారంతా తనను వదిలి ఆయన చుట్టూ తిరుగుతుండడం అబ్బాయ్ రామ్మోహన్‌కు ఇబ్బంది కలిగిస్తోందని ప్రచారం జరుగుతోంది. జిల్లా కేంద్రంలోనూ అదే పరిస్థితి ఇక జిల్లా కేంద్రంలో పార్టీ క్యాడర్ గతంలో రెండు వర్గాలుగా ఉండేంది. ఇప్పుడు అందరూ అచ్చెన్న వద్దకు క్యూ కడుతున్నారు. అటు ఎంపీ వద్దకు గానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే వద్దకు గానీ ఎవరూ వెళ్లకపోవడం గమనార్హం. అదే విధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టు విచారణలో ఉన్నందున నిలిచిపోయిన శ్రీకాకుళం మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా సంబంధిత మున్సిపాలిటీ ఏ నియోజకవర్గం పరిధిలో ఉంటే.. ఆ ఎమ్మెల్యే, ఎంపీలకే అభ్యర్థుల ఎంపిక బాధ్యత అప్పగిస్తారు. అందుకు విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎంపీ, ఎమ్మెల్యేలను మంత్రి చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాగే మండల పరిషత్ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారు కూడా మిగతా ప్రయత్నాలను పక్కన పెట్టి ప్రాపకం కోసం ఆరాటపడు తున్నారు.