గనుల అక్రమ తవ్వకాలపై సర్కారు కొరడా | Illegal Granite Mining In Prakasam District | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో భారీగా గనుల దోపిడీ

Published Tue, Feb 18 2020 7:26 PM | Last Updated on Tue, Feb 18 2020 7:32 PM

Illegal Granite Mining In Prakasam District - Sakshi

సాక్షి, విజయవాడ/ప్రకాశం: ప్రకాశం జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదు నెలలుగా సర్వే చేపట్టిన గనుల శాఖ అధికారులు వందల కోట్లు దోపిడీని గుర్తించారు. ఈ అడ్డగోలు గనుల తవ్వకాల వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ను పరిధిని మించి తవ్వకాలు జరిపినట్లు గనుల శాఖ గుర్తించింది. బల్లికురవ మండలం కొనిదెన లో ఓ కంపెనీ భారీ దోపిడీ కి పాల్పడింది. 17 లక్షల 76 వేల 137 క్యూబిక్ మీటర్ల తవ్వకాలు చేసింది. 15 శాతం రికవరితో 2 లక్షల 66 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ గా అధికారులు తేల్చారు. లక్షా 216 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతి తీసుకున్న సంస్థ.. అక్రమంగా లక్షా 66 వేల 204 క్యూబిక్ మీటర్లు తవ్వేసింది. అక్రమ మైనింగ్‌ కి పాల్పడిన ఓ కంపెనీకి రూ.285 కోట్ల ఫీజు కట్టాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. టీడీపీ నేతల దోపిడీని కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియా వింత రాతలు రాయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement