illegal granite mining
-
ప‘రాయి’ సొమ్ముపై దురాశ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ టెక్కలి నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమార్కులు చెలరేగిపోయారు. నాడు మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు అండ చూసుకుని రెచ్చిపోయారు. లీజుకు తీసుకున్న ప్రాంతంలోనే కాకుండా, లీజుకు వెలుపల ఉన్న ప్రాంతంలో కూడా అనధికార తవ్వకాలు జరిపి వందల కోట్ల కలర్ గ్రానైట్‌ను అక్రమంగా కొట్టేశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఇందులో అచ్చెన్నాయుడు, నాటి అధికారుల పాత్ర ఉంది. అక్రమార్కుల దయతో అప్పట్లో పనిచేసిన కొందరు అధికారులు కోటీశ్వరులైపోయారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డెరెక్టర్ హో దాల్లో వారంతా ఇందులో ఉన్నారు. కలర్ గ్రానైట్ చరిత్ర ఇది.. అంతర్జాతీయ స్థాయి గ్రానైట్ వ్యాపారంలో టెక్కలి కలర్ గ్రానైట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నీలి గ్రానైట్‌కు దేశంతోపాటు అత్యంత సంపన్నమైన విదేశాల్లో ప్రత్యేక గిరాకీ ఉంది. ప్రతి ఏడాది అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రానైట్ వస్తు ప్రదర్శనలో టెక్కలి నీలి గ్రానైట్ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం లభిస్తోంది. 1992 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన గ్రానై ట్ వ్యాపారస్థులు ఈ ప్రాంతంలో గ్రానైట్ క్వారీలను ప్రారంభించగా, నేడు ఆ గ్రానైట్ వ్యాపారం వందల కోట్ల రూపాయల లాభాలను గడిస్తోంది. ఇక్కడ నుంచి నీలి గ్రానైట్ ముందుగా బెంగళూరు, మద్రాసు, తమిళనాడు, కర్ణాటక, సేలం తదితర ప్రాంతాలకు తరలివెళ్తుంది. అక్కడ నుంచి ఇటలీ, జర్మనీ, పో లెండ్, స్విట్జర్లాండ్, చైనా, తైవాన్, సింగపూర్ తదితర ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ 65 గ్రానైట్ క్వారీలుండగా.. వందకు పైగా పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఇతర ప్రాంతాల వ్యాపారులు, ఇక్కడ టీడీపీ నేత అచ్చెన్నతోపాటు మరికొందరు నేతలు పెద్ద ఎత్తున యత్నించారు. అక్రమాలు నిగ్గు తేలాయిలా.. టీడీపీ అధికారంలో ఉన్నంత సేపూ మైనింగ్ అక్రమాలను కనీ సం పట్టించుకోలేదు. ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు చేసేది. పత్రికల్లో వార్తలొచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. తమకు మంత్రి అండగా ఉన్నారని, తమనెవరూ ఏమీ చేయలేరని అటు క్వారీ నిర్వహకులు, ఇటు అధికారులు పట్టనట్టు వ్యవహరించేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు, మైనింగ్ విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ పనసారెడ్డి నేతృత్వంలో, మైనింగ్ శాఖ రీజనల్ విజిలెన్స్ స్క్వాడ్ అసి స్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు టెక్కలి నియోజకవర్గంతోపాటు వంగర మండలంలో ని క్వారీల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అక్కడ జరిగిన అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఎంఎస్పీ గ్రానైట్‌లో రూ.215 కోట్లకు పైగా అక్రమాలు కోటబొమ్మాళి మండలం లింగాలవలసలో ఉన్న ఎస్ఎంపీ గ్రానైట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ బృందాలు గుర్తించాయి. ఇక్కడ 56,009 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్‌ను అక్రమంగా తవి్వనట్టు తేల్చారు. దీని విలు వ రూ.196 కోట్ల 3 లక్షల 15 వేలుగా లెక్కగట్టారు. దీనికి సంబంధించి తప్పించుకున్న జీఎస్టీ విలువ రూ.23 కోట్ల 52 లక్షల 37 వేల 800గా తేల్చారు. అపరాధ రుసుంతో కలిపి 215 కోట్ల 6 లక్షల, 27 వేల 76 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని నోటీసు కూడా జారీ చేశారు. క్వారీ లీజు హోల్డర్ డేబుక్, లెడ్జర్, సేల్ బిల్లులు, వేబిల్స్ మొదలైన రికార్డులను సరిగా నిర్వహించలేదు. అంతేకాకుండా తవ్వేసిన బ్లాకులు వెళ్లాక వ్యర్థ మెటీరియల్‌తో ఆ గోతు లు పూడ్చేసిన దృశ్యాలు బయటపడ్డాయి. వాస్తవానికి ఎంఎస్పీ గ్రానైట్‌ను 2015లో రెన్యువల్ చేయడమే అక్రమం. అప్పటికే రికవరీ పర్సంటేజీ తీసేయగా 65 వేల క్యూబిక్ మీటర్లకు కట్టాలి. కానీ కేవలం 20 వేల క్యూబిక్ మీటర్లకు కట్టాలి. మిగతా 45 వేల క్యూబిక్ మీటర్లకు ఆ డబ్బులు క ట్టించకుండానే అధికారులను మేనేజ్ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు 2015లో రెన్యువల్ చేసేశారు. 2019లో ఫిర్యాదుతో తనిఖీలు చేసే సరికి పాత 45 వేల క్యూబిక్ మీటర్లతోపాటు కొత్తగా తవ్విన మరో 10 వేల క్యూబిక్ మీటర్లకు ప్రభుత్వానికి చెల్లింపులు చేయాలి. ఇదంతా అడ్డగోలుగా జరిగింది. ఐశ్వర్య గ్రానైట్‌లోనూ అదే తంతు టెక్కలి నియోజకవర్గం కోట»ొమ్మాళి మండలం పట్టుపురంలో ఉన్న ఐశ్వర్య గ్రానైట్స్ అండ్ మినరల్స్‌లో లీజు పరిధిలో చట్టవిరుద్ధంగా 589 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్ తవ్వి సొమ్ము చేసుకున్నారు. దీని విలువ రూ.88 లక్షల 35 వేలు కాగా, దానికి సంబంధించి రూ.10,60,200 జీఎస్టీని ఎగ్గొట్టారు. అలాగే, లీజు వెలుపల 321 క్యూబిక్ మీటర్ల కలర్ గ్రానైట్‌ను అక్రమంగా తవ్వారు. దాని విలువ రూ.48 లక్షల 15 వేలుగా తేల్చారు. మొత్తం అనధికారికంగా కొట్టేసిన కలర్ గ్రానైట్‌కు సంబం«ధించి రూ.16 లక్షల 38 వేల జీఎస్టీ ఎగ్గొట్టారు. వీరికి కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు. వంగర మండలంలోనూ అక్రమాలే వంగర మండలంలోని జగన్నాథపురం గ్రామంలో గల పూ శ్య క్వారీ వెలుపల ప్రాంతంలో అనధికారికంగా 17,164 క్యూబిక్ మీటర్ల మేర వైట్ గెలాక్సీ/ కాశీ్మర్ వైట్ తవ్వకాలు జరిపారు. 42 కోట్ల 32 లక్షల 56 వేల 549 లబ్ధి పొందినట్టు గుర్తించారు. జీఎస్టీ 3 కోట్ల 28 లక్షల 41 వేల 600 ఎగ్గొట్టారు. అచ్చెన్నాయుడు ఇలాకాలో బ్లాకులు అక్రమమార్గం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టెక్కలి మైన్స్ కార్యాలయం పరిధిలో గల గ్రానైట్ క్వారీల నుంచి అక్రమ మార్గంలో లెక్కలేని బ్లాకులు తరలిపోయాయి. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు చెందిన గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు నిమ్మాడ సమీపంలో ఉండడంతో యథేచ్ఛగా కోట్ల రూపా యల విలువైన బ్లాకులను తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి గ్రానైట్ క్వారీ నుంచి కొంత మేరకు బ్లాకులను కింజరాపు కుటుంబ సభ్యులకు చెందిన పాలిషింగ్ యూనిట్లకు మామూళ్లుగా పంపించాలంటూ క్వా రీ నిర్వాహకులకు సైతం హుకుం జారీ చేసేవారనేది బహిరంగ రహస్యం. వీటితో పాటు క్వారీల్లో బ్లాకులు తవి్వన తర్వాత వచ్చిన వేస్ట్ మెటీరియల్ రవాణా విషయంలో సై తం ఎలాంటి అధికార అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా క్రషర్స్, రోడ్డు పనులకు తరలించేవారు. ఎవరైనా అధి కారి వాళ్ల అక్రమాలకు అడ్డు తగిలితే జిల్లా నుంచి అన్యాయంగా పంపించేసేవారు. అలాంటి వారిలో మైనింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డి ఒకరు బలయ్యారు. సీఎం రమే‹Ù, కళా వెంకటరావు, దేవినేని వెంకటేశ్వరరావు, కింజరాపు హరిప్రసాద్‌లకు చెందిన స్టోన్ క్రషర్ల అక్రమాలు నిగ్గు తేల్చారని యుద్ధప్రాతిపదికన బదిలీ చేసేశారు. మూడు నోటీసులు జారీ చేశాం... టెక్కలి సమీపంలో క్వారీలు, స్టోన్ క్రషర్స్‌పై విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల పర్యవసానంగా వారందించిన మూడు నోటీసులను సంబంధిత క్వారీల యజమానులకు జారీ చేశాం. వీరిలో ఎంఎస్పీ క్వారీ యాజమాన్యం ప్రభుత్వాన్ని కలిసి, రీసర్వే జరపాలని కోరింది. – కె.శంకర్రావు, మైన్స్ ఏడీ, టెక్కలి -
గనుల అక్రమ తవ్వకాలపై సర్కారు కొరడా
సాక్షి, విజయవాడ/ప్రకాశం: ప్రకాశం జిల్లాలో గనుల అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఐదు నెలలుగా సర్వే చేపట్టిన గనుల శాఖ అధికారులు వందల కోట్లు దోపిడీని గుర్తించారు. ఈ అడ్డగోలు గనుల తవ్వకాల వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ను పరిధిని మించి తవ్వకాలు జరిపినట్లు గనుల శాఖ గుర్తించింది. బల్లికురవ మండలం కొనిదెన లో ఓ కంపెనీ భారీ దోపిడీ కి పాల్పడింది. 17 లక్షల 76 వేల 137 క్యూబిక్ మీటర్ల తవ్వకాలు చేసింది. 15 శాతం రికవరితో 2 లక్షల 66 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ గా అధికారులు తేల్చారు. లక్షా 216 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతి తీసుకున్న సంస్థ.. అక్రమంగా లక్షా 66 వేల 204 క్యూబిక్ మీటర్లు తవ్వేసింది. అక్రమ మైనింగ్ కి పాల్పడిన ఓ కంపెనీకి రూ.285 కోట్ల ఫీజు కట్టాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. టీడీపీ నేతల దోపిడీని కప్పిపుచ్చేందుకు ఎల్లో మీడియా వింత రాతలు రాయడం గమనార్హం. -
కొండను పిండేందుకు కొత్త కసరత్తు
కాసుల సంపాదనకు తెలుగు తమ్ముళ్లు ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేశారు. మట్టి మింగేశారు.. కొండలను కొల్ల గొట్టారు. అధికారం కోల్పోయినప్పటికీ పాత అలవాటును మాత్రం వారు మానలేదు. ఇప్పటికీ కొండలను గుల్ల చేసేందుకు యత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఆనూరు కొండపై ఇప్పుడు కన్నేశారు. సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు కోట్లాది రూపాయలు కూడబెట్టకున్నారు. అధికారం కోల్పోయినా వారు గ్రావెల్ తవ్వకాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులు ఈదిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు జోరుగా ఉన్నాయి. అందులో భాగంగానే వారు ఆనూరు కొండపై ఉన్న భూములను చదును చేసుకోడానికి అనుమతించాలంటూ పెద్దాపురం తహసీల్దార్‌కు దరఖాస్తు చేశారు. రామేశ్వరం కొండపై ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరం పాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవనం సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించింది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొని వారి అనుమతులు ఉన్నాయంటూ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 50 అడుగుల ఎత్తుగా వాలుగా ఉన్న కొండను తవ్వేసారు. ఈ కొండల మీదుగా 33కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేశారు. వాటి చుట్టూ కూడా గ్రావెల్ తవ్వేశాశారు. ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరంమెట్టపై ఉన్న భూములు 800 ఎకరాల వరకు పేద దళితులకు పంపిణీ చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరో 530 ఎకరరాల భూమిని ఒక్కొక్క కుటుంబానికి ఎకరం 35 సెంట్లు చొప్పున పంపిణీ చేశారు. రాజన్న హయాంలో బోర్లు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇందిరా క్రాంతి పథం, ఇందిరా జల ప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపు లైన్లు వేయించారు. దాంతో మెట్టపై జీడీ మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. దాంతో ఎకరానికి రూ.30వేల నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చే దని రైతులు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో మామిడి, జీడి మామిడి మొక్కలను ఈ మెట్టపై వేసుకునేందుకు అధికారులు మొక్కలను పంపిణి చేశారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రతీ నెల రూ.1500 నుంచి రూ.మూడు వేల వరకు ఇచ్చేవారు. విద్యుత్తు సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న ఈ మెట్టను తవ్వుకొనేందుకు అధికారులు ఏ విధంగా అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. వందల కోట్ల లావాదేవీలు మెట్టపై తవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 10 పొక్లెయినర్లతో 24 గంటల పాటు నిరంతరాయంగా తవ్వకాలు జరిగాయి. ఎకరం భూమిలో సుమారు 10వేల లారీల వరకు గ్రావెల్ తవ్వుతున్నట్టు తెలిసింది. లారీ గ్రావెల్ రూ.రెండు వేలకు విక్రయించారు. ఆ లెక్కన ఎకరం నుంచి వచ్చే ఆదాయం రూ. రెండు కోట్లు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్రమ తవ్వకాలకు బ్రేక్ వేసింది. అయితే తెలుగుదేశం నేతల అండతో ఆనూరు కొండపై నాలుగు ఎకరాల భూమిలో తవ్వకాలు చేసుకోడానికి అనుమతి ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవు పెద్దాపురం డివిజన్ పరిధిలో గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి బీఎస్ఆర్ కనస్ర ్టక్షన్‌కు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా ఏడీబీ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలోనే గ్రావెల్ తవ్వకాలు చేయాలి. – ఎస్.మల్లిబాబు, ఆర్డీవో, పెద్దాపురం -
చీమకుర్తి టు చైనా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రానైట్ అక్రమ విదేశీ ఎగుమతి యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకుండానే జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ ప్రాంతానికి చెందిన కొందరు గ్రానైట్ వ్యాపారులు గ్రానైట్‌ను చైనాకు తరలిస్తున్నారు. చీమకుర్తి నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు రాయిని తరలించి అక్కడ నుంచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. ఏడాదికి ఒక్క ఎగుమతుల ద్వారానే వ్యాపారులు రూ.100 కోట్లకుపైగానే పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు సమాచారం. గ్రానైట్ అక్రమ ఎగుమతులను అడ్డుకోవాల్సిన అధికారులు దానికి స్వస్తి పలికి అక్రమ ఎగుమతులను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రవాణాశాఖ, మైనింగ్, విజిలెన్స్ విభాగాల పరిధిలోని కొందరు అధికారులు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వారికి వ్యాపారులు పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులే అక్రమ ఎగుమతులు ప్రోత్సహిస్తుండటంతో వ్యాపారుల అక్రమాలకు అడ్డేలేకుండా పోతోంది. కృష్ణపట్నం పోర్టు ద్వారా అక్రమ ఎగుమతులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. డిమాండ్ తగ్గిందంటున్న వ్యాపారులు.. అసలు గ్రానైట్ ఎగుమతులే తగ్గిపోయాయని ముఖ్యంగా చైనాకు ఎగుమతులు తగ్గాయని గ్రానైట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. చైనాలో గ్రానైట్‌కు డిమాండ్ తగ్గిందని, ఇటు కొందరు మైనింగ్ అధికారులు సైతం పేర్కొంటున్నారు. వాస్తవంగా చైనాకు గ్రానైట్ ఎగుమతులు ఏ మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ గణాంకాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఎగుమతులు తగ్గకపోగా కొంత మేర పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎగుమతుల తీరు ఇదీ.. 2014-15లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ 3,33,737 క్యూబిక్ మీటర్లు ఎగుమతి కాగా, 2015-16లో 3,53,142 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. 2016-17 ఏడాదికిగాను ఏప్రిల్, మే, జూన్, జూలై నాలుగు నెలల్లోనే 1,25,138 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. ఇక బ్లాక్ గ్రానైట్ 2014-15లో 35,965 క్యూబిక్ మీటర్లు ఎగుమతి కాగా, 2015-16లో 56,781 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. 2016-17లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 20,931 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. కలర్ గ్రానైట్ 2014-15లో 50,568 క్యూబిక్ మీటర్లు, 2015-16లో 85,509 క్యూబిక్ మీటర్లు, 2016-17లో ఏప్రిల్ నుంచి జూలై వరకు 31,398 క్యూబిక్ మీటర్లు ఎగుమతి అయింది. ఈ గణాంకాలు చూస్తే గతంతో పోలిస్తే గ్రానైట్ ఎగుమతులు ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.