ప‘రాయి’ సొమ్ముపై దురాశ! | Illegal Mining‌ Excavations In TDP Government Period | Sakshi
Sakshi News home page

ప‘రాయి’ సొమ్ముపై దురాశ!

Published Tue, Jul 21 2020 7:13 AM | Last Updated on Tue, Jul 21 2020 7:13 AM

Illegal Mining‌ Excavations In TDP Government Period - Sakshi

కోటబొమ్మాళి మండలంలోని ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ లోపలి భాగం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ టెక్కలి నియోజకవర్గంలో గ్రానైట్‌ అక్రమార్కులు చెలరేగిపోయారు. నాడు మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు అండ చూసుకుని రెచ్చిపోయారు. లీజుకు తీసుకున్న ప్రాంతంలోనే కాకుండా, లీజుకు వెలుపల ఉన్న ప్రాంతంలో కూడా అనధికార తవ్వకాలు జరిపి వందల కోట్ల కలర్‌ గ్రానైట్‌ను అక్రమంగా కొట్టేశారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఇందులో అచ్చెన్నాయుడు, నాటి అధికారుల పాత్ర ఉంది. అక్రమార్కుల దయతో అప్పట్లో పనిచేసిన కొందరు అధికారులు కోటీశ్వరులైపోయారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్, జాయింట్‌ డెరెక్టర్‌ హో దాల్లో వారంతా ఇందులో ఉన్నారు.  

కలర్‌ గ్రానైట్‌ చరిత్ర ఇది.. 
అంతర్జాతీయ స్థాయి గ్రానైట్‌ వ్యాపారంలో టెక్కలి కలర్‌ గ్రానైట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నీలి గ్రానైట్‌కు దేశంతోపాటు అత్యంత సంపన్నమైన విదేశాల్లో ప్రత్యేక గిరాకీ ఉంది. ప్రతి ఏడాది అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రానైట్‌ వస్తు ప్రదర్శనలో టెక్కలి నీలి గ్రానైట్‌ ఉత్పత్తులకు ప్రత్యేక స్థానం లభిస్తోంది. 1992 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన గ్రానై ట్‌ వ్యాపారస్థులు ఈ ప్రాంతంలో గ్రానైట్‌ క్వారీలను ప్రారంభించగా, నేడు ఆ గ్రానైట్‌ వ్యాపారం వందల కోట్ల రూపాయల లాభాలను గడిస్తోంది. ఇక్కడ నుంచి నీలి గ్రానైట్‌ ముందుగా బెంగళూరు, మద్రాసు, తమిళనాడు, కర్ణాటక, సేలం తదితర ప్రాంతాలకు తరలివెళ్తుంది. అక్కడ నుంచి ఇటలీ, జర్మనీ, పో లెండ్, స్విట్జర్లాండ్, చైనా, తైవాన్, సింగపూర్‌ తదితర ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ 65 గ్రానైట్‌ క్వారీలుండగా.. వందకు పైగా పాలిషింగ్‌ యూనిట్లు ఉన్నాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఇతర ప్రాంతాల వ్యాపారులు, ఇక్కడ టీడీపీ నేత అచ్చెన్నతోపాటు మరికొందరు నేతలు పెద్ద ఎత్తున యత్నించారు. 

అక్రమాలు నిగ్గు తేలాయిలా.. 
టీడీపీ అధికారంలో ఉన్నంత సేపూ మైనింగ్‌ అక్రమాలను కనీ సం పట్టించుకోలేదు. ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు చేసేది. పత్రికల్లో వార్తలొచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. తమకు మంత్రి అండగా ఉన్నారని, తమనెవరూ ఏమీ చేయలేరని అటు క్వారీ నిర్వహకులు, ఇటు అధికారులు పట్టనట్టు వ్యవహరించేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు, మైనింగ్‌ విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ పనసారెడ్డి నేతృత్వంలో, మైనింగ్‌ శాఖ రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ అసి స్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు టెక్కలి నియోజకవర్గంతోపాటు వంగర మండలంలో ని క్వారీల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అక్కడ జరిగిన అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి.   

ఎంఎస్‌పీ గ్రానైట్‌లో రూ.215 కోట్లకు పైగా అక్రమాలు  
కోటబొమ్మాళి మండలం లింగాలవలసలో ఉన్న ఎస్‌ఎంపీ గ్రానైట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్‌ బృందాలు గుర్తించాయి. ఇక్కడ 56,009 క్యూబిక్‌ మీటర్ల కలర్‌ గ్రానైట్‌ను అక్రమంగా తవి్వనట్టు తేల్చారు. దీని విలు వ రూ.196 కోట్ల 3 లక్షల 15 వేలుగా లెక్కగట్టారు. దీనికి సంబంధించి తప్పించుకున్న జీఎస్‌టీ విలువ రూ.23 కోట్ల 52 లక్షల 37 వేల 800గా తేల్చారు. అపరాధ రుసుంతో కలిపి 215 కోట్ల 6 లక్షల, 27 వేల 76 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని నోటీసు కూడా జారీ చేశారు. క్వారీ లీజు హోల్డర్‌ డేబుక్, లెడ్జర్, సేల్‌ బిల్లులు, వేబిల్స్‌ మొదలైన రికార్డులను సరిగా నిర్వహించలేదు. అంతేకాకుండా తవ్వేసిన బ్లాకులు వెళ్లాక వ్యర్థ మెటీరియల్‌తో ఆ గోతు లు పూడ్చేసిన దృశ్యాలు బయటపడ్డాయి. వాస్తవానికి ఎంఎస్‌పీ గ్రానైట్‌ను 2015లో రెన్యువల్‌ చేయడమే అక్రమం. అప్పటికే రికవరీ పర్సంటేజీ తీసేయగా 65 వేల క్యూబిక్‌ మీటర్లకు కట్టాలి. కానీ కేవలం 20 వేల క్యూబిక్‌ మీటర్లకు కట్టాలి. మిగతా 45 వేల క్యూబిక్‌ మీటర్లకు ఆ డబ్బులు క ట్టించకుండానే అధికారులను మేనేజ్‌ చేసి అంతా సవ్యంగా ఉన్నట్టు 2015లో రెన్యువల్‌ చేసేశారు. 2019లో ఫిర్యాదుతో తనిఖీలు చేసే సరికి పాత 45 వేల క్యూబిక్‌ మీటర్లతోపాటు కొత్తగా తవ్విన మరో 10 వేల క్యూబిక్‌ మీటర్లకు ప్రభుత్వానికి చెల్లింపులు చేయాలి. ఇదంతా అడ్డగోలుగా జరిగింది.      

ఐశ్వర్య గ్రానైట్‌లోనూ అదే తంతు  
టెక్కలి నియోజకవర్గం కోట»ొమ్మాళి మండలం పట్టుపురంలో ఉన్న ఐశ్వర్య గ్రానైట్స్‌ అండ్‌ మినరల్స్‌లో లీజు పరిధిలో చట్టవిరుద్ధంగా 589 క్యూబిక్‌ మీటర్ల కలర్‌ గ్రానైట్‌ తవ్వి సొమ్ము చేసుకున్నారు. దీని విలువ రూ.88 లక్షల 35 వేలు కాగా, దానికి సంబంధించి రూ.10,60,200 జీఎస్‌టీని ఎగ్గొట్టారు. అలాగే, లీజు వెలుపల 321 క్యూబిక్‌ మీటర్ల కలర్‌ గ్రానైట్‌ను అక్రమంగా తవ్వారు. దాని విలువ రూ.48 లక్షల 15 వేలుగా తేల్చారు. మొత్తం అనధికారికంగా కొట్టేసిన కలర్‌ గ్రానైట్‌కు సంబం«ధించి రూ.16 లక్షల 38 వేల జీఎస్టీ ఎగ్గొట్టారు. వీరికి కూడా షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.  

వంగర మండలంలోనూ అక్రమాలే  
వంగర మండలంలోని జగన్నాథపురం గ్రామంలో గల పూ శ్య క్వారీ వెలుపల ప్రాంతంలో అనధికారికంగా 17,164 క్యూబిక్‌ మీటర్ల మేర వైట్‌ గెలాక్సీ/ కాశీ్మర్‌ వైట్‌ తవ్వకాలు జరిపారు. 42 కోట్ల 32 లక్షల 56 వేల 549 లబ్ధి పొందినట్టు గుర్తించారు. జీఎస్టీ 3 కోట్ల 28 లక్షల 41 వేల 600 ఎగ్గొట్టారు.  

అచ్చెన్నాయుడు ఇలాకాలో బ్లాకులు అక్రమమార్గం 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో టెక్కలి మైన్స్‌ కార్యాలయం పరిధిలో గల గ్రానైట్‌ క్వారీల నుంచి అక్రమ మార్గంలో లెక్కలేని బ్లాకులు తరలిపోయాయి. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు చెందిన గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు నిమ్మాడ సమీపంలో ఉండడంతో యథేచ్ఛగా కోట్ల రూపా యల విలువైన బ్లాకులను తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు ప్రతి గ్రానైట్‌ క్వారీ నుంచి కొంత మేరకు బ్లాకులను కింజరాపు కుటుంబ సభ్యులకు చెందిన పాలిషింగ్‌ యూనిట్లకు మామూళ్లుగా పంపించాలంటూ క్వా రీ నిర్వాహకులకు సైతం హుకుం జారీ చేసేవారనేది బహిరంగ రహస్యం. వీటితో పాటు క్వారీల్లో బ్లాకులు తవి్వన తర్వాత వచ్చిన వేస్ట్‌ మెటీరియల్‌ రవాణా విషయంలో సై తం ఎలాంటి అధికార అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా క్రషర్స్, రోడ్డు పనులకు తరలించేవారు. ఎవరైనా అధి కారి వాళ్ల అక్రమాలకు అడ్డు తగిలితే జిల్లా నుంచి అన్యాయంగా పంపించేసేవారు. అలాంటి వారిలో మైనింగ్‌ అధికారి ప్రతాప్‌రెడ్డి ఒకరు బలయ్యారు. సీఎం రమే‹Ù, కళా వెంకటరావు, దేవినేని వెంకటేశ్వరరావు, కింజరాపు హరిప్రసాద్‌లకు చెందిన స్టోన్‌ క్రషర్‌ల అక్రమాలు నిగ్గు తేల్చారని యుద్ధప్రాతిపదికన బదిలీ చేసేశారు.  

మూడు నోటీసులు జారీ చేశాం... 
టెక్కలి సమీపంలో క్వారీలు, స్టోన్‌ క్రషర్స్‌పై విజిలెన్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీల పర్యవసానంగా వారందించిన మూడు నోటీసులను సంబంధిత క్వారీల యజమానులకు జారీ చేశాం. వీరిలో ఎంఎస్‌పీ క్వారీ యాజమాన్యం ప్రభుత్వాన్ని కలిసి, రీసర్వే జరపాలని కోరింది.   
 – కె.శంకర్రావు, మైన్స్‌ ఏడీ, టెక్కలి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement