ఏపీకి అదనంగా విద్యుత్ కేటాయించండి
కేంద్రాన్ని కోరిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు అదనంగా విద్యుత్‌ను కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరే షన్ (ఎన్‌టీపీసీ) నుంచి ప్రత్యేకంగా ఏపీకి విద్యుత్ కేటాయించాలన్నారు. అయితే తెలంగాణకు కేటాయించిన విద్యుత్‌లో కోత విధించి తమకు దాన్ని మళ్లించే ప్రయత్నాలు వద్దని చెప్పారు. శనివారం ఇక్కడ ఎన్‌టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఏపీకి కేటాయించాల్సిన విద్యుత్ కంటే తక్కువ కేటాయించారని, ఈ విషయంలో ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.