ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు | In favor of investments in Andhra | Sakshi
Sakshi News home page

ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు

Published Sun, Nov 9 2014 1:13 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

In favor of investments in Andhra

విద్యుత్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు

హైదరాబాద్: రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి  చూపుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇటీవల బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో జరిగిన సీఐఐ సదస్సుల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు.

విద్యుత్ అంశంపై శనివారం ఆయన తన కార్యాలయ కార్యదర్శి జి.సాయిప్రసాద్, విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. రాష్ర్టంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా విద్యుత్ కొరత ఎదుర్కోకూడదని, నాణ్యమైన విద్యుత్‌ను పరిశ్రమలకు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement