బాలికలలో అక్షరాస్యతను పెంపొందించడంతోపాటు స్వయం ఉపాధి కల్పన కోసం ప్రవేశపెట్టిన జాతీయ బాలికల ఎలిమెంటరీ విద్య (ఎన్‌పీఈజీఈఎల్) అటకెక్కింది. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రభుత్వ పాఠశాలలలో బాలికల ఎలిమెంటరీ విద్యకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో లక్షల రూపాయలు వృథా అయ్యాయి. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన బోధనోపకరణాలు,పరికరాలు స్టోర్‌రూముల్లో మగ్గుతున్నాయి.
నిజాంసాగర్, న్యూస్‌లైన్: 2008-09లో జిల్లాలోని 272 పాఠశాలల ను మోడల్ క్లస్టర్లుగా ఎంపిక చేసి ఎన్ పీఈజీ ఈఎల్ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో పాఠశాలకు కేంద్రం విడతలవారీగా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల నిధులను కేటాయించింది. 2008-09లో రూ. 63వేలు, 2009-10లో రూ. 53,540, 2010-11లో రూ. 31,800, 2011-12లో రూ. 42,250, 2012-13లో రూ. 20,250 మంజూరయ్యాయి. ఈ నిధులను వె చ్చించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు బోధనోపకరణాలను, పరికరాలను కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని పరికరాలను కేం ద్రం సరఫరా చేసింది. ఇవన్నీ ఇపుడు మూలకు పడ్డాయి. కొన్ని పాఠశాలలలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిధులకు అధికారులు లెక్కపత్రం అడుగపోవడంతో ఇష్టారాజ్యంగా కొనసాగింది.
ఈ ఏడాది స్వస్తి
ప్రభుత్వ పాఠశాలలలో చదువుతోపాటు విద్యార్థినులలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యతలను వెలికితీసేందుకు కేంద్రం ఎన్‌పీజీఈఎల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థినులు చిన్నప్పటి నుంచే అన్ని రంగాలలో రా ణించేందుకు ఇది దోహదపడుతుందని భావిం చింది. కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి వేతనాలు చెల్లిస్తూ ఆయా పాఠశాలలో గత ఐదేళ్లుగా శిక్షకులను నియమించారు.
వారు పాఠశాలలో 6, 7, 8 తరగతులు చదివే బాలిక లకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, అగరుబత్తు లు, సుద్ద ముక్కలు, కొవ్వొత్తులు, సర్ఫ్, వ్యాజి లిన్, ఫినాయిల్, తయారీ, గాజుల డిజైనింగ్ తదితర అంశాలలో శిక్షణ ఇచ్చేవారు. దీంతో బాలికలు భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందగలుగుతారనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, కేంద్రం ఈ ఏడాది నిధులను నిలిపివేసింది. దీంతో ఆయా పాఠశాలల నుంచి శిక్షకులను తొలగించారు.
మూలనపడ్డ పరికరాలు
బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు, పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం వేలాది రూపాయలను మంజూరు చేసింది. విద్యార్థినులు ఆయా అంశాలను నేర్చుకొనడంలో ఆసక్తి చూపారు. మూడు నెలల శిక్షణలో విద్యార్థినులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేవారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పథకం నిర్వహణకు అనుమతించకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి.
స్వయం ఉపాధి శిక్షణ అవసరం
ప్రభుత్వ పాఠశాలలలో చదువుతో పాటు బాలికలకు స్వయం ఉపాధి శిక్షణ ఎంతో అవసరం. గతంలో ఇచ్చిన శిక్షణ ద్వారా కుట్లు, అల్లికలు నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా కొనసాగించాలి.
- సీహెచ్ సౌమ్య విద్యార్థిని
వృత్తి విద్య నేర్పించాలి
బాలికల ఎలిమెంటరీ విద్య ద్వారా ఇస్తున్న వృత్తి విద్య శిక్షణ ఎంతో మేలు చేకూర్చింది. ఎన్‌పీఈజీఈఎల్ ద్వారా అగర్‌బత్తీలు, క్యాండిల్స్, ఫినాయిల్ తయారు చేయ డం నేర్చుకున్నాం. ఇపుడు నిలిపివేయడం బాధగా ఉంది.
-టి . కృష్ణవేణి, 9వ తరగతి
ప్రభుత్వం నిధులు ఇస్తే
బాలికల ఎలిమెంటరీ విద్యకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పాఠశాలలలో పథకం ముందుకు సాగడం లేదు. ఇందుకు సంబంధించిన పరికరాలు వృథా కాకుండా ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకుంటారు. కేంద్రం ద్వారా నిధులు వస్తే ఎన్‌పీఈజీఈఎల్‌ను తిరిగి ప్రారంభిస్తాం.
- శ్రీనివాసాచారి,
జిల్లా విద్యాధికారి
నిలిచిన శిక్షణ
Published Mon, Feb 3 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement