Thousand of rupes
-
వెన్నువిరిగింది
మనుబోలు: అందరికీ అన్నం పెట్టే అన్నదాత కన్నీరు పెడుతున్నాడు...ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతకందే సమయంలో సాగునీరు అందకపోవడంతో విలవిలలాడిపోతున్నాడు. వేలాది రూపాయలు అప్పులు చేసి వేసిన వరి పంట తీరా నీరందక వెన్నుతీసే దశలో ఎండిపోతుండటంతో లబోదిబోమంటున్నాడు. ఈనేపథ్యంలోనే మంగళవారం కొండుపాలెం గ్రామంలో ఓ ఎస్సీ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదీ కనుపూరు కాలువ పరిధిలోని మెట్ట గ్రామాల రైతుల దుస్థితి. మండలంలోని బండేపల్లి, ముద్దుమూడి, చెరుకుమూడి బ్రాంచ్ కాలువల పరిధిలో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదికాక మరో 5 వేల ఎకరాల్లో ఏటా అనధికారికంగా రైతులు వరి సాగుచేస్తారు. గతంలోనే అధికారులు వరిసాగుకు నీరందించలేమంటూ ప్రకటనలు చేయడంతో మూడింట రెండొంతుల భూముల్లో రైతులు ఈఏడాది సాగు చేపట్టలేదు. మూడో వంతు రైతులు మాత్రం డిసెంబర్లో కురిసిన వర్షాలకు నాట్లు వేశారు. ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో ఇటీవల వరకూ ఎలాగో పంటను కాపాడుకుంటూ వచ్చారు. అయితే వరి వెన్ను తీసే దశకు చేరుకున్నా బ్రాంచ్ కాలువలకు చుక్క నీరు కూడా రాకపోవడంతో కళ్ల ముందే పంట ఎండిపోతుంటే కన్నీరుమున్నీరవుతున్నారు. సోమశిల జలాశయం నుంచి సంగం బ్యారేజి ద్వారా కనుపూరు వసతిగృహాల్లో పరిశీలిస్తే వార్డెన్ లేరు. ట్యూటర్లులేరు. వార్డెన్ ఒక అసిస్టెంటును పెట్టి చుట్టంచూపుగా వస్తుంటారని తెలిసింది. సూళ్ళూరుపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్లో వార్డెన్లు పగలు మాత్రమే వస్తారని అక్కడే ఉన్నవారు తెలిపారు. వెంకటగిరి బీసీ హాస్టల్లో ట్యూటర్లు లేరు ..వార్డెన్లు అందుబాటులో లేరు ..విద్యార్థులు ఎవరి అవస్థలు వారు పడుతున్నారు. బోగోలులోని ఎస్సీ వసతిగృహంలో ట్యూటర్లు లేరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్‌కోత ఎక్కువగా ఉండటంతో రాత్రివేళల్లో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు. జిల్లాలో 104 ఎస్సీ హాస్టళ్లలో 2,100 మంది, 11 ఎస్టీ వసతిగృహాలలో 239 మంది, 86 బీసీ హాస్టళ్లలో 1,500 మంది పదోతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో వీరిలో ఆందోళన మొదలైంది. పరీక్ష సమయంలో రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్‌ను, తెల్లవారుజామున 5 గంటలకు స్టడీ అవర్‌ను నిర్వహించాల్సి ఉంది. స్టడీ అవర్ ఉన్నంత సేపు ట్యూటర్లు, స్థానికంగా వార్డెన్లు ఉండాలి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ట్యూటరు చొప్పున నాలుగు సబ్జెక్టులకు నలుగురు ఉండాలి. కాని ట్యూటర్లకు ఏడాది నుంచి జీతాలు లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ట్యూటర్లు రావడం లేదు. దీనికితోడు చాలాచోట్ల వార్డెన్లు రాత్రి 8 గంటలకే వెళ్లిపోగా, మరి కొంతమంది 9 గంటల వరకు ఉండి వెళ్లిపోతున్నారు. ఉదయం ఆరు గంటలకు కొందరు ట్యూటర్లు, వార్డెన్లు వస్తే మరి కొంతమంది మాత్రం తీరిగ్గా 8 గంటలకు వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు పెట్టే అన్నం రేషన్‌లో ఇచ్చే బియ్యంతో వడ్డిస్తుండటంతో వారు నీరసంగా ఉంటున్నారు. సరైన ఆహారం లేక రాత్రి పూట ఎక్కువసేపు మేలుకుని చదువుకోలేకపోతున్నామని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. అలాగే చాలీచాలని దుప్పట్లు, ఒక పక్క దోమల బెడద ఎక్కువగా ఉండటం చూస్తుంటే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. -
కాసులిస్తే..వేటుండదు!
సాక్షి, కరీంనగర్: తప్పు చేశారు.. అనుకోకుండా దొరికిపోయారు. ఆ తప్పు నుంచి తప్పించుకునేందుకు నానాతిప్పలు పడుతున్నారు. సిబ్బం ది చేసిన తప్పిదాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్న ఓ అధికారి.. వారిని వేటు పేరిట భయపెడుతున్నాడు. వేలాది రూపాయలు చెల్లించాలని, లేకుంటే శాఖాపరంగా శిక్ష తప్పదని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఏం చేయాలో తోచక కొందరు తమ ను మన్నించాలని సదరు అధికారిని వేడుకుంటుంటే.. ఇంకొందరు శాఖాపరమైన చర్యలకు జడిసి అడిగినంత ఇచ్చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న ఈ అవినీతి హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌హెల్త్ సెంటర్లలో 524 మంది రెగ్యులర్, 576 కాంట్రాక్టు ఏఎన్ఎంలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు తాము పని చేసే కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో తిరిగి పారిశుధ్యం, ప్రజారోగ్యంపై రోగులు, గర్భిణులు, బాలింతలకు సల హాలు, సూచనలందిస్తారు. క్షేత్రస్థాయిలో తిరిగే సమస్య, జీతభత్యాలు తక్కువగా ఉండటంతో కాంట్రాక్టు పద్ధతి లో పనిచేసే పన్నెండుమంది ఏఎన్ఎంలు ఒకేచోట ఉండి పనిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పై చదువులు చదివి.. పీహెచ్సీ, ఆస్పత్రుల్లో స్టాఫ్‌నర్స్‌గా పర్మినెంట్ ఉద్యోగం సాధించాలనుకున్నారు. కరీంనగర్లో ఓ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. రోజు విడిచి రోజు విధులు ఎగ్గొట్టి కాలేజీకి రాకపోకలు సాగించారు. కొన్ని నెలలు వారి చదువు సాఫీగానే సాగింది. తర్వాత ఈ వ్యవహారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి దృష్టిలో పడింది. విధులకు బదులు కాలేజీలో శిక్షణకు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్న ఆ అధికారి ఏఎన్ఎంలు చేరిన కాలేజీ నుంచి నేరుగా వారి సర్టిఫికెట్లు.. హాజరుపట్టిక తెప్పించుకున్నారు. కాలేజీలో చదివేందుకు అనుమతి ఎవరిచ్చారని హెచ్చరించారు. కోర్సులో చేరిన తప్పునకు జరిమానాగా రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాలని ఏఎన్ఎంలతో చెప్పారు. దీంతో తమను మన్నించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఏఎన్ఎంలు ఆ అధికారిని వేడుకున్నారు. అయినా తీరు మారని సదరు అధికారి డబ్బులివ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక కొందరు ఏఎన్ఎంలు డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై డీఎంహెచ్‌వో బాలు వివరణ ఇస్తూ.. జిల్లాలో చాలామంది కాంట్రాక్టు ఏఎన్ఎంలు నిబంధనలకు విరుద్ధంగా నర్సింగ్ కళాశాలల్లో చేరి, స్టాఫ్‌నర్సు శిక్షణ తీసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
నిలిచిన శిక్షణ
బాలికలలో అక్షరాస్యతను పెంపొందించడంతోపాటు స్వయం ఉపాధి కల్పన కోసం ప్రవేశపెట్టిన జాతీయ బాలికల ఎలిమెంటరీ విద్య (ఎన్పీఈజీఈఎల్) అటకెక్కింది. విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రభుత్వ పాఠశాలలలో బాలికల ఎలిమెంటరీ విద్యకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో లక్షల రూపాయలు వృథా అయ్యాయి. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన బోధనోపకరణాలు,పరికరాలు స్టోర్‌రూముల్లో మగ్గుతున్నాయి. నిజాంసాగర్, న్యూస్‌లైన్: 2008-09లో జిల్లాలోని 272 పాఠశాలల ను మోడల్ క్లస్టర్లుగా ఎంపిక చేసి ఎన్ పీఈజీ ఈఎల్ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో పాఠశాలకు కేంద్రం విడతలవారీగా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల నిధులను కేటాయించింది. 2008-09లో రూ. 63వేలు, 2009-10లో రూ. 53,540, 2010-11లో రూ. 31,800, 2011-12లో రూ. 42,250, 2012-13లో రూ. 20,250 మంజూరయ్యాయి. ఈ నిధులను వె చ్చించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయు లు బోధనోపకరణాలను, పరికరాలను కొనుగోలు చేశారు. ఇందులో కొన్ని పరికరాలను కేం ద్రం సరఫరా చేసింది. ఇవన్నీ ఇపుడు మూలకు పడ్డాయి. కొన్ని పాఠశాలలలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిధులకు అధికారులు లెక్కపత్రం అడుగపోవడంతో ఇష్టారాజ్యంగా కొనసాగింది. ఈ ఏడాది స్వస్తి ప్రభుత్వ పాఠశాలలలో చదువుతోపాటు విద్యార్థినులలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యతలను వెలికితీసేందుకు కేంద్రం ఎన్పీజీఈఎల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థినులు చిన్నప్పటి నుంచే అన్ని రంగాలలో రా ణించేందుకు ఇది దోహదపడుతుందని భావిం చింది. కేంద్రం మంజూరు చేసిన నిధుల నుంచి వేతనాలు చెల్లిస్తూ ఆయా పాఠశాలలో గత ఐదేళ్లుగా శిక్షకులను నియమించారు. వారు పాఠశాలలో 6, 7, 8 తరగతులు చదివే బాలిక లకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, అగరుబత్తు లు, సుద్ద ముక్కలు, కొవ్వొత్తులు, సర్ఫ్, వ్యాజి లిన్, ఫినాయిల్, తయారీ, గాజుల డిజైనింగ్ తదితర అంశాలలో శిక్షణ ఇచ్చేవారు. దీంతో బాలికలు భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందగలుగుతారనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, కేంద్రం ఈ ఏడాది నిధులను నిలిపివేసింది. దీంతో ఆయా పాఠశాలల నుంచి శిక్షకులను తొలగించారు. మూలనపడ్డ పరికరాలు బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు, పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం వేలాది రూపాయలను మంజూరు చేసింది. విద్యార్థినులు ఆయా అంశాలను నేర్చుకొనడంలో ఆసక్తి చూపారు. మూడు నెలల శిక్షణలో విద్యార్థినులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేవారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పథకం నిర్వహణకు అనుమతించకపోవడంతో పరికరాలు మూలన పడ్డాయి. స్వయం ఉపాధి శిక్షణ అవసరం ప్రభుత్వ పాఠశాలలలో చదువుతో పాటు బాలికలకు స్వయం ఉపాధి శిక్షణ ఎంతో అవసరం. గతంలో ఇచ్చిన శిక్షణ ద్వారా కుట్లు, అల్లికలు నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా కొనసాగించాలి. - సీహెచ్ సౌమ్య విద్యార్థిని వృత్తి విద్య నేర్పించాలి బాలికల ఎలిమెంటరీ విద్య ద్వారా ఇస్తున్న వృత్తి విద్య శిక్షణ ఎంతో మేలు చేకూర్చింది. ఎన్పీఈజీఈఎల్ ద్వారా అగర్బత్తీలు, క్యాండిల్స్, ఫినాయిల్ తయారు చేయ డం నేర్చుకున్నాం. ఇపుడు నిలిపివేయడం బాధగా ఉంది. -టి . కృష్ణవేణి, 9వ తరగతి ప్రభుత్వం నిధులు ఇస్తే బాలికల ఎలిమెంటరీ విద్యకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పాఠశాలలలో పథకం ముందుకు సాగడం లేదు. ఇందుకు సంబంధించిన పరికరాలు వృథా కాకుండా ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకుంటారు. కేంద్రం ద్వారా నిధులు వస్తే ఎన్పీఈజీఈఎల్ను తిరిగి ప్రారంభిస్తాం. - శ్రీనివాసాచారి, జిల్లా విద్యాధికారి