మనుబోలు: అందరికీ అన్నం పెట్టే అన్నదాత కన్నీరు పెడుతున్నాడు...ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతకందే సమయంలో సాగునీరు అందకపోవడంతో విలవిలలాడిపోతున్నాడు. వేలాది రూపాయలు అప్పులు చేసి వేసిన వరి పంట తీరా నీరందక వెన్నుతీసే దశలో ఎండిపోతుండటంతో లబోదిబోమంటున్నాడు. ఈనేపథ్యంలోనే మంగళవారం కొండుపాలెం గ్రామంలో ఓ ఎస్సీ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదీ కనుపూరు కాలువ పరిధిలోని మెట్ట గ్రామాల రైతుల దుస్థితి. మండలంలోని బండేపల్లి, ముద్దుమూడి, చెరుకుమూడి బ్రాంచ్ కాలువల పరిధిలో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇదికాక మరో 5 వేల ఎకరాల్లో ఏటా అనధికారికంగా రైతులు వరి సాగుచేస్తారు.
గతంలోనే అధికారులు వరిసాగుకు నీరందించలేమంటూ ప్రకటనలు చేయడంతో మూడింట రెండొంతుల భూముల్లో రైతులు ఈఏడాది సాగు చేపట్టలేదు. మూడో వంతు రైతులు మాత్రం డిసెంబర్‌లో కురిసిన వర్షాలకు నాట్లు వేశారు. ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో ఇటీవల వరకూ ఎలాగో పంటను కాపాడుకుంటూ వచ్చారు. అయితే వరి వెన్ను తీసే దశకు చేరుకున్నా బ్రాంచ్ కాలువలకు చుక్క నీరు కూడా రాకపోవడంతో కళ్ల ముందే పంట ఎండిపోతుంటే కన్నీరుమున్నీరవుతున్నారు. సోమశిల జలాశయం నుంచి సంగం బ్యారేజి ద్వారా కనుపూరు వసతిగృహాల్లో పరిశీలిస్తే వార్డెన్ లేరు.
ట్యూటర్లులేరు. వార్డెన్ ఒక అసిస్టెంటును పెట్టి చుట్టంచూపుగా వస్తుంటారని తెలిసింది. సూళ్ళూరుపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో వార్డెన్లు పగలు మాత్రమే వస్తారని అక్కడే ఉన్నవారు తెలిపారు. వెంకటగిరి బీసీ హాస్టల్‌లో ట్యూటర్‌లు లేరు ..వార్డెన్‌లు అందుబాటులో లేరు ..విద్యార్థులు ఎవరి అవస్థలు వారు పడుతున్నారు. బోగోలులోని ఎస్సీ వసతిగృహంలో ట్యూటర్లు లేరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే విద్యుత్‌కోత ఎక్కువగా ఉండటంతో రాత్రివేళల్లో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు వాపోయారు.
జిల్లాలో 104 ఎస్సీ హాస్టళ్లలో 2,100 మంది, 11 ఎస్టీ వసతిగృహాలలో 239 మంది, 86 బీసీ హాస్టళ్లలో 1,500 మంది పదోతరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో వీరిలో ఆందోళన మొదలైంది. పరీక్ష సమయంలో రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్‌ను, తెల్లవారుజామున 5 గంటలకు స్టడీ అవర్‌ను నిర్వహించాల్సి ఉంది. స్టడీ అవర్ ఉన్నంత సేపు ట్యూటర్‌లు, స్థానికంగా వార్డెన్లు ఉండాలి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ట్యూటరు చొప్పున నాలుగు సబ్జెక్టులకు నలుగురు ఉండాలి. కాని ట్యూటర్‌లకు ఏడాది నుంచి జీతాలు లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ట్యూటర్లు రావడం లేదు. దీనికితోడు చాలాచోట్ల వార్డెన్లు రాత్రి 8 గంటలకే వెళ్లిపోగా, మరి కొంతమంది 9 గంటల వరకు ఉండి వెళ్లిపోతున్నారు. ఉదయం ఆరు గంటలకు కొందరు ట్యూటర్లు, వార్డెన్లు వస్తే మరి కొంతమంది మాత్రం తీరిగ్గా 8 గంటలకు వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకు పెట్టే అన్నం రేషన్‌లో ఇచ్చే బియ్యంతో వడ్డిస్తుండటంతో వారు నీరసంగా ఉంటున్నారు. సరైన ఆహారం లేక రాత్రి పూట ఎక్కువసేపు మేలుకుని చదువుకోలేకపోతున్నామని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. అలాగే చాలీచాలని దుప్పట్లు, ఒక పక్క దోమల బెడద ఎక్కువగా ఉండటం చూస్తుంటే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది.
వెన్నువిరిగింది
Published Wed, Mar 11 2015 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement