పాలమూరు, న్యూస్‌లైన్: అవస్థ..ఒక్కనాటిది కాదు..పాఠశాల నడిచినన్ని రోజులూ పంటి బిగువున భరించాల్సిందే. తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని చిన్నారులు ప్రతి రోజూ పడుతున్న వేదన ఇది. సరిగ్గా.. రెండేళ్ల క్రితం.. 2012 అక్టోబరు నెలలో సుప్రీం కోర్టు స్పం దించి తీవ్రంగా హెచ్చరించినా పాల కుల్లో స్పందన రాలేదు. సర్కారు బడు ల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం సాగడం లేదు. పాలమూరు జిల్లాలో 2,729 ప్రాథమిక పాఠశాలలుండగా, 580 వరకు ప్రాథమికోన్నత పాఠశాల లు, 643 ఉన్నత పాఠశాలలున్నాయి.
ఇందుకుగాను పాఠశాలల నిర్వహణకోసం ఏటా రూ. 3.95కోట్లు నిధులు మంజూరవుతున్నా.. వాటి ఫలితాలు ఎక్కడా కనబడటం లేదు. గతంలో ని ర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టిసారించకపోవడంతో అవి ఉపయోగంలో లేకుండా పోతున్నా యి. జిల్లా వ్యాప్తంగా 1559 పాఠశాల ల్లోని విద్యార్థులు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 2,948 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రహరీల్లేవు. దీం తో ఆయా పాఠశాలలన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారా యి. 794 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంలేదు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 600 అదనపు తరగతి గదులు అవసరం. ఈ సంఖ్య కేవలం విద్యాశాఖ లెక్కల ప్రకారం మాత్రమే.. వాస్తవానికి చూస్తే 75 శాతం వరకు పాఠశాలల్లో తగిన మౌలిక వసతుల్లేక విద్యార్థినీ, విద్యార్థులు అవస్థపడుతున్నారు.
సమన్వయలోపం
ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయలోపం కారణంగా.. విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్ శాఖదేనని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఎప్పుడో నిర్మించాం. వా టిని మనుగడలో ఉంచుకోకపోవడానికి బా ధ్యులం తాము కాదని అయితే ఆ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిర్మాణాలు చేపడుతున్న కొత్త భవనాల వద్ద వారే టాయ్‌లెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నా రు. వీటి నిర్మాణం కోసం రెండేళ్లుగా నిధులు మంజూరు కావడం లేదని ఆ శాఖ అధికారి పేర్కొన్నారు. జిల్లాలోని అధికశాతం పాఠశాలల్లో మూత్రశాల లు, మరుగుదొడ్లు, కాం పౌండ్ వాల్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం ఏర్పా టు వంటివి లేకపోవడంతో విద్యార్థినులు అవస్థపడాల్సి వస్తోంది.
పెరుగుతున్న డ్రాపౌట్లు
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో విద్యార్థినులు అనేక అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు సక్రమంగా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. మరికొంత మంది పాఠశాలకు రావడం మానేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా.. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదు. ఉన్న కొన్ని మరుగుదొడ్ల లో నీటి వసతి లేవు. దీంతో అవి కూడా నిరుపయోగంగానే ఉంటున్నాయి.
సౌకర్యాలు కను‘మరుగు’
Published Mon, Dec 9 2013 5:16 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
Advertisement