dropouts
-
మళ్లీ చదువుల ఒడికి
దీర్ఘకాలం డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి.. దీర్ఘకాలం డ్రాపౌట్స్‌గా గుర్తించిన విద్యార్థులకు సంబంధించిన కారణాలను ఇంటింటి సర్వేలో వలంటీర్లు సేకరిస్తున్నారు. బాల్య వివాహాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ పనులకు వెళ్తున్నారా? అనే వివరాలను సేకరించడంతో పాటు తల్లిదండ్రులకు నచ్చచెప్పి చదువుల ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరిస్తూ బడిబాట పట్టిస్తున్నారు. ఈ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు. సాక్షి, అమరావతి: కారణం ఏదైనప్పటికీ ఓ చిన్నారి చదువులకు దూరమైతే రేపటి తరాలకు పూడ్చలేని నష్టం వాటిల్లుతుంది. ఆ ఒక్క కుటుంబమే కాకుండా సమాజం మొత్తంపై ఈ ప్రభావం పడుతుంది. పేద కుటుంబాల్లో విద్యా కుసుమాలు వికసించినప్పుడే దుర్భర దారిద్య్రానికి సంపూర్ణంగా తెర పడుతుంది. ఒకవైపు విద్యారంగ సంస్కరణలతో చదువులను చక్కదిద్ది అడుగడుగునా ప్రోత్సహిస్తున్నరాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు వివిధ కారణాలతో స్కూళ్లకు దూరమైన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అర్ధాంతరంగా బడి మానేసిన చిన్నారులను గుర్తించి తిరిగి పాఠశాల బాట పట్టించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 1,47,687 మంది విద్యార్థులను తిరిగి బడిలో చేర్చడం ఇందుకు నిదర్శనం. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, విద్యాకానుక తదితర పథకాలతోపాటు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ విధానం, ఫౌండేషన్ స్కూళ్ల ద్వారా చదువులను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. హాజరు పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ పాఠశాల వయసు పిల్లలంతా బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సచివాలయాలు కేంద్రంగా ఆయా పరిధిలోని స్కూళ్లలో చదివే పిల్లల హాజరును నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా “కన్సిస్టెంట్ రిథమ్స్’ యాప్‌ను తీసుకొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు పిల్లలు బడికి గైర్హాజరైతే వలంటీర్‌తో పాటు సంక్షేమ, విద్యా అసిస్టెంట్ సంబంధిత విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుంటున్నారు. బడికి రాకపోవడానికి కారణాలను వాకబు చేస్తున్నారు. ఏదైనా సమస్య కారణంగా బడి మానేసినట్లు గుర్తిస్తే తగిన పరిష్కార మార్గాలను చూపేలా కృషి చేస్తున్నారు. వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేలా చర్యలు చేపడుతున్నారు. క్రమం తప్పకుండా సమీక్ష రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ విద్యారంగ సంస్కరణల ఫలాలు అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో కొద్దిమంది పిల్లలు మధ్యలో బడి మానేయడానికి కారణాలను సచివాలయాల వారీగా నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పిల్లల డ్రాపౌట్లు, పాఠశాలల్లో చేరికలపై సమీక్ష చేపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో స్కూళ్లవారీగా కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. స్కూల్ హెడ్మాస్టర్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు, సంక్షేమ, విద్యా అసిస్టెంట్, గ్రామ ముఖ్యలతో కమిటీలను నియమించారు. ఈ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై పాఠశాలల్లో విద్యార్ధుల హాజరుతో పాటు వివిధ వసతులపై సమీక్షిస్తుంది. పిల్లలు మధ్యలో బడి మానేయకుండా తగిన చర్యలు చేపడుతుంది. ప్రతి నెలా కమిటీ సమావేశమై తీసుకున్న చర్యలపై పాఠశాల విద్యాశాఖకు నివేదిక అందచేస్తుంది. వారంలో ఒక రోజు బడి బాట ఉపాధ్యాయుల హాజరుకు సంబంధించిన వివరాలను కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సంక్షేమ విద్యా అసిస్టెంట్ వారంలో ఒక రోజు తన పరిధిలోని స్కూళ్లను సందర్శించి విద్యార్ధులు హాజరుతో పాటు ఎన్రోల్మెంట్, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలలో సౌకర్యాలను పర్యవేక్షించి వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. ఏఎన్ఎంలు నెలలో ఒక రోజు స్కూళ్ల వద్దకు వెళ్లి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాక్సినేషన్ వివరాలను యాప్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. మహిళా పోలీసులు వారంలో ఒక రోజు స్కూళ్లను సందర్శించి పిల్లల హక్కులు, బాలికల భద్రత తదితర అంశాలను పర్యవేక్షించి వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. వీటిని పరిశీలించి ఎక్కడైనా సమస్యలు, లోపాలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. సందర్శన ఫోటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. పాఠశాలలను ఇలా సూక్ష్మస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం వినియోగిస్తోంది. -
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
కాలేజ్ డ్రాప్‌అవుట్స్..! చిన్న వయసులోనే రూ. 4310 కోట్లకు అధిపతులైన కుర్రాళ్లు..!
Zepto Success Story In Telugu: కాలేజ్ డ్రాప్‌అవుట్స్...! అయితేనేం ఒక చిన్న ఐడియా 19 ఏళ్ల యువకుల జీవితాలనే మార్చేసింది. సుమారు రూ. 4310 కోట్ల విలువ కల్గిన కంపెనీకి అధిపతులుగా అవతారమెత్తి ఔరా..! అనిపిస్తున్నారు ముంబై యువకులు. బలమైన బేసిక్స్‌తో..కంపెనీ స్థాపన..! ముంబైకు చెందిన 19 ఏళ్ల కుర్రాళ్లు ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సీటీలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాం కోర్సు నుంచి తప్పుకున్నారు. భారత్‌కు వచ్చిన వీరు ఇరువురు జెప్టో (Zepto) అనే గ్రాసరీ స్టార్టప్‌ను స్థాపించారు. కంప్యూటర్ సైన్స్‌లో బలమైన బేసిక్స్ ఉండడంతో ఈ స్టార్టప్ నిర్వహణ మరింత సులువైంది. తొలుత ముంబై నగరాల్లో వీరు జెప్టో గ్రాసరీ సేవలను మొదలుపెట్టారు. భారీగా ఆదరణ రావడంతో బెంగళూరు, ఢిల్లీ, మరో నాలుగు నగరాలకు ఈ స్టార్టప్ సేవలను విస్తరించారు. 10 నిమిషాల్లోనే డెలివరీ చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత. 5 నెలల్లోనే 570 మిలియన్ డాలర్లు..! వై కాంబినేటర్ నిర్వహించిన ఫండింగ్ రౌండ్లో తాజాగా 100 మిలియన్ డాలర్లను జెప్టో సొంతం చేసుకుంది. జెప్టో కంపెనీ స్థాపించిన 5 నెలల్లోనే 570 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 4310 కోట్ల) కంపెనీగా అవతారమెత్తింది. ఈ కంపెనీ ప్రముఖ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది.ఈ స్టార్టప్‌కు గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్ పార్ట్నర్స్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్, బ్రేయర్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీకు చెందిన లాచీ గ్రూమ్ వంటి ఇన్వెస్టర్లు మద్దతునిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలకు భారీ పోటీ...! భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపార నిపుణుల అభిప్రాయం. దీంతో ఆయా దిగ్గజ కంపెనీలు ఆన్లైన్ డెలివరీలపై దృష్టిసారించారు. ప్రముఖ దిగ్గజ కంపెనీలు బ్లింక్ఇట్, డూంజో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ సేవలను అందిస్తోన్న కంపెనీలకు జెప్టో భారీ పోటీనిస్తోంది. చదవండి: పాత కార్లతో వ్యాపారం..! వేల కోట్లను తెచ్చిపెట్టింది..! -
అక్షరానికి దూరమైన బాల్యం కోసం ‘ఆమె’ తాపత్రయం..!
Sabiha Hashmi Story In Telugu: ఒక మంచి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటే మార్గం కూడా ఉంటుంది. సమయం కూడా వస్తుంది. అందుకు ఉదాహరణ సబిహా హష్మి. స్కూల్ డ్రాప్ అవుట్లుగా మిగులుతున్న బాలికల కోసం ఆమె ఏడు పదుల వయసులో మళ్లీ ఉద్యోగం చేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన సబిహా హష్మి నేషనల్ మ్యూజయమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఆర్ట్, కన్జర్వేషన్ అండ్ మ్యూజయాలజీలో పీహెచ్డీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్లోని హెరిటేజ్ స్కూల్లో పిల్లలకు స్కెచింగ్, పెయింటింగ్, కళల చరిత్ర బోధించేవారు. పిల్లలకు బోధనేతర విజ్ఞానం కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లేవారు. ఓసారి ఉత్తర హిమాలయ పర్వత శ్రేణుల దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడి కుగ్రామాల్లో నివసించే అమ్మాయిలను చూసి బాధపడేవారామె. స్కూలు వయసులోనే చదువు మానేసి పెళ్లి చేసుకుని చంకలో బిడ్డతో, ఇంటి బాధ్యతలు మోస్తున్న ఆడపిల్లలు కనిపించేవారు. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. అక్షరానికి దూరమైన బాల్యం ఆమె గుండెను కదిలించేది. అయితే వాళ్ల కోసం తాను చేయగలిగిందేమీ ఆమెకు కనిపించలేదు. అప్పటికామె చేయగలిగింది బాధపడి ఊరుకోవడమే. ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్లకు ఆమె పిల్లల దగ్గరకు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆమె 2010 లో కర్నాటక, రామనగర జిల్లా, జ్యోతిపాళయ గ్రామానికి వచ్చారు. ‘‘ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక్కసారిగా హిమాలయ పర్వత గ్రామాల్లో చూసినటువంటి దృశ్యాలు కనిపించాయి. నేను అక్కడ చూసినప్పుడు అక్కడి అమ్మాయిల కోసం ఏదైనా చేయాలంటే తగిన ఆర్థిక వెసులుబాటు లేదు. ఇప్పుడైతే నాకు చేతనైనదేదో చేయగలను... అనిపించింది. గ్రామం శివారులో మా పొలానికి సమీపంలో చిన్న కాటేజ్ కట్టించి బాలికలకు ఉచితంగా చదువు చెప్పడం మొదలు పెట్టాను. నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చే బాలికల్లో ఓ ఎనిమిది మందికి పుస్తకాలు కొనుక్కోవడం కూడా కష్టమేనని కొన్నాళ్ల తర్వాత తెలిసింది. వాళ్ల చదువు కొనసాగాలంటే పుస్తకాల వంటి కనీస అవసరాలు తీరాలి. నాకు కొంత స్థిరమైన సంపాదన ఉంటే తప్ప సాధ్యం కాదనిపించింది. దాంతో స్థానికంగా ఓ స్కూల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అలాగే నాకు ఆర్ట్, క్రాఫ్ట్ కూడా తెలిసి ఉండడంతో పిల్లలకు పాఠాల తర్వాత బొమ్మలు వేయడం, కార్డ్‌బోర్డుతో బుక్ రాక్, పెన్సిల్ హోల్డర్, రిమోట్ బాక్సులు, ఆభరణాలు దాచుకునే పెట్టెలు వంటి ఇంటి వాడుకలో అవసరమైన వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడం కూడా నేర్పిస్తున్నాను. వీటిని నెలకోసారి నేను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న స్కూల్లో స్టాల్ పెడతాం. చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మా ఉత్పత్తులను తీసుకుంటుంది. అలా వచ్చిన డబ్బుతో జ్యోతిపాళయంలో చదువుకు దూరమైన ఆడపిల్లల చదువు కొనసాగుతోంది. నలుగురు విద్యార్థినులు టెన్త్ క్లాస్ పూర్తి చేశారు. ఈ మధ్యనే ఒకమ్మాయి బీఈడీ పూర్తి చేసింది. ఒకమ్మాయి బీకామ్ 74 శాతంతో పూర్తి చేసి మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేస్తోంది. నా దగ్గర చదువుకుంటున్న వాళ్లలో బాలికలతోపాటు పెళ్లయిన యువతులు, బిడ్డ తల్లులు ఉన్నారు. పరీక్షలు రాసి పై చదువులకు వెళ్లలేకపోయినప్పటికీ నేర్చుకోగలిగినంత నేర్చుకుంటామని వచ్చే వాళ్లు, చదువుకోవడం ద్వారా తమకంటూ ఒక గుర్తింపు కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లను చూసినప్పుడు వాళ్ల చేత స్కూల్ డ్రాప్ అవుట్ చేయించి పెళ్లి చేసినన తల్లిదండ్రుల మీద ఆగ్రహం కలుగుతుంటుంది కూడా’’ అంటారు సబిహా హష్మి. అజ్జి లైబ్రరీ! సబిహ తన డెబ్బై రెండేళ్ల వయసులో తన అక్షరసేవను పాఠ్యపుస్తకాల నుంచి కథల పుస్తకాలకు విస్తరింపచేశారు. పిల్లల పుస్తకాలతో ఒక మోస్తరు లైబ్రరీని ఏర్పాటు చేశారామె. ఆ లైబ్రరీ పేరు ‘అజ్జిస్ లెర్నింగ్ సెంటర్’. అజ్జి లైబ్రరీకి జ్యోతిపాళయం నుంచి మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల పిల్లలు కూడా వారానికోసారి వచ్చి పుస్తకాలు తీసుకెళ్లి చదువుకుంటున్నారు. ఆమె సర్వీస్‌ను చూసిన వాళ్లు ప్రశంసలతో సరిపుచ్చకుండా లైబ్రరీ విస్తరణ కోసం విరాళాలిస్తున్నారు. దాంతో ఆమె కంప్యూటర్ ట్రైనింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అజ్జి లెర్నింగ్ సెంటర్‌ను పిల్లల సమగ్ర వికాసానికి దోహదం చేసే వేదికగా మలచాలనేదే తన కోరిక అంటారామె. ఇలాంటి వాళ్లు ఊరికొక్కరు ఉన్నా చాలు. బడికి దూరమైన అమ్మాయిల జీవితాలు అక్షరాలా బాగుపడతాయి. చదవండి: Health Tips: చిగుళ్లనుంచి తరచూ రక్తం వస్తుందా? ఇవి తిన్నారంటే.. -
ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్‌కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. జడ్చర్ల జూనియర్ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్ రఘురామ్ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్ రఘురామ్ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు. -
డ్రాపౌట్స్‌కు చెక్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు లేకుండా చూడాలని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా సీఎం కేసీఆర్ విద్యాసంస్థలకు వసతులు సమకూరుస్తూ విద్యారంగాన్ని ముందు కు తీసుకెళ్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. బుధవారం ఎస్సీఈఆర్టీ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. విద్యాశాఖలో విభాగాల వారీగా సంబంధిత అధికారులతో మాట్లాడి చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, పురోగతి తదితరాలను సమీక్షించారు. పదోతరగతిలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు అధికారులు, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌ ట్ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని, వీటి నివారణ సంతృప్తికరంగా లేదని, ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగంలో ప్రథమ స్థానంలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలన్నారు. అసెంబ్లీ సమావేశాలనంతరం సుదీర్ఘ సమీక్ష స్వచ్ఛ విద్యాలయ పేరుతో ప్రతి పాఠశాలల్లో 30 రోజుల ప్రణాళికను అమలు చేయాలని సబిత సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తక్కువ సమయం కేటాయించానని.. సమావేశాల అనంతరం ప్రతి విభాగంతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహిస్తానన్నారు. -
ఇంటర్ గడప దాటగానే 15% డ్రాపౌట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేలాది మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.. పదో తరగతి, ఇంటర్ పాసైనా పైచదువులకు వెళ్లకుండా పని బాట పడుతున్నారు. ఓవైపు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఈ పరిస్థితికి కారణంకాగా.. విద్యార్థుల్లో పైచదువులపై అవగాహన లోపం, సామర్థ్యాల లేమి మరో కారణంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏటా ఇంటర్మీడియట్ తర్వాత సగటున 15 శాతం మంది చదువు ఆపేస్తుండడం ఆందోళనకరమైన అంశం. విద్యాశాఖ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల లెక్కలు చూస్తే.. ఇంటర్ పూర్తయ్యాక చదువు మానేస్తున్నవారి శాతం కొన్నేళ్లుగా దాదాపు ఒకే స్థాయిలో ఉంటోంది. 2016–17లో ఉత్తీర్ణులైన మొత్తం ఇంటర్ విద్యార్థుల్లో 14 శాతం మంది డ్రాపౌట్స్‌గా మిగిలిపోగా... 2015–16లో 17 శాతం మంది.. 2014–15లో 15 శాతం మంది పై చదువులకు వెళ్లలేదు. ఇక పదో తరగతికి వస్తే.. 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తయిన వారిలో 4.95 శాతం మంది పైచదువులకు దూరంకాగా.. 2015–16లో 6 శాతం మంది, 2014–15లో 7 శాతం మంది డ్రావుట్స్గానే మిగిలిపోయారు. ఇంటర్ తర్వాత భారీగా.. రాష్ట్రవ్యాప్తంగా 2016–17 విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 4,14,213 మంది హాజరుకాగా.. అందులో 3,38,903 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 2,91,088 మంది వివిధ కోర్సుల్లో చేరగా.. 47,842 మంది వివిధ కారణాలతో చదువుకు దూరమయ్యారు. ఇక ఇంటర్ తరువాత వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో 1,00,701 మంది చేరగా.. అందులో 10 శాతం మంది ఏపీ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఉన్నట్లు అంచనా. అంటే 90,631 మంది రాష్ట్రవిద్యార్థులు వివిధ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. ఇక డిగ్రీ కోర్సుల్లో 2,00,457 మంది చేరారు. ‘పది’తోనే ఆగిపోయిన 23,820 మంది 2016–17 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు 5,97,064 మంది హాజరుకాగా.. అందులో 4,80,831 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 3,99,377 మంది ఇంటర్లో, 26,594 మంది ఐటీఐలలో, 31,040 పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరారు. మొత్తంగా పదో తరగతి పూర్తయిన వారిలో... 4,57,011 మంది వివిధ కోర్సుల్లో చేరగా 23,820 మంది చదువును ఆపేసినట్లు ఉన్నత విద్యా మండలి లెక్కలు వేసింది. 2017–18లో ఇంటర్ తరువాత వివిధ కోర్సుల్లో చేరినవారు కోర్సు చేరినవారు బీటెక్ 68,593 బీఫార్మసీ 6,500 డీఎడ్ 10,200 ఎంబీబీఎస్ 3,200 బీడీఎస్ 1,400 ఆయుష్ 695 అగ్రికల్చర్, వెటర్నరీ 500 జాతీయ విద్యా సంస్థలు, విదేశీ చదువుకు వెళ్లిన వారు 9,612 బీఏలో చేరిన వారు 25,599 బీబీఎం 306 బీబీఏ 1,762 బీసీఏ 336 బీకాం 80,696 బీఎస్సీ 91,702 బీఎస్‌డబ్ల్యూ 36 డిగ్రీ వొకేషనల్ 20 ఇదీ చదువుల దుస్థితి.. పదో తరగతి స్థాయి నుంచి.. సంవత్సరం పాసైనవారు పైకోర్సుల్లోకి డ్రాపౌట్ 2014–15 4,44,828 4,13,691 31,137 2015–16 4,37,192 4,10,961 26,231 2016–17 4,80,831 4,57,011 23,820 ఎందుకు ఆపేస్తున్నారు? – పదో తరగతి తరువాత చదువు ఆపేస్తున్న వారిలో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతోనే మానేస్తున్నట్లు గుర్తించారు. – ఇంటర్ పూర్తయిన వారు మాత్రం ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ పోషణ భారం మీద పడటంతో చదువులకు దూరమవుతున్నట్లు తేల్చారు. – ఇక పైచదువులకు తగిన సామర్థ్యాలు కొరవడటంతో.. తాను ఇక చదవలేన్న ఆలోచన, ఆత్మన్యూనతా భావంతో చదువు మానేస్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. దీంతో ఏదో ఒక పని చేసుకుని బతుకుదామన్న ధోరణితో చదువుకు దూరమవుతున్నారు. – పై చదువులపై అవగాహన లోపం కూడా కొందరు విద్యార్థులు దూరమవడానికి కారణంగా గుర్తించారు. – పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్నవారిలో చాలా మందికి పైచదువులకు వెళ్లాలన్న కోరిక ఉన్నా... పరిస్థితుల కారణంగా వెనక్కి తగ్గుతున్నట్లు విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. డ్రాపౌట్స్ తగ్గించేలా చర్యలు చేపట్టాలి.. ‘‘పదో తరగతి, ఇంటర్ తరువాత విద్యార్థులు చదువు మానేయడం మంచిదికాదు. కొద్దిగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ప్రభుత్వం కూడా డ్రాపౌట్లను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి..’’ – ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ పి.మధుసూదన్‌రెడ్డి -
డ్రాపౌట్లను బడిలో చేర్చండి: కలెక్టర్
సమీక్షలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంగారెడ్డి జోన్: జిల్లాలో బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్ రోస్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ 15 మండలాలకు సంబంధించిన మండల విద్యాధికారులు, రీసోర్స్ పర్సన్లతో సమీక్ష జరిపారు. జిల్లాలో మొత్తం 3,700 మంది పిల్లలు మధ్యలో బడి మానేశారని తెలిపారు. యూనిసెఫ్ సౌజన్యంతో జిల్లాలో వలస వెళ్లిన పిల్లలను, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడి బాట పట్టించాలన్నారు. పిల్లల కోసం 15 మండలాల్లో 163 ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపా రు. ఏప్రిల్ 18 నుంచి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యా వలంటీర్ల ద్వారా తెలుగు, ఆంగ్లం, గణిత శాస్త్రం బోధించడం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక బోధన కార్యాక్రమం జూలై 15వరకు కొనసాగిస్తామన్నారు. ఇప్పటి వరకు మూడు వేల మంది పిల్లలను గుర్తించి బడి బాటలోకి తేవడం జరిగిందని, మిగిలిన ఏడు వందల మంది పిల్లలను పాఠశాలలో చేర్పించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. బడిలో చేరకపోవడానికి గల కారణాలను నివేదిక రూపంలో అందజేయాలని కోరారు. పిల్లలను తిరిగి బడిలో చేరి పాఠశాల వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉదయం పూట స్నాక్స్ ఏర్పాటు చేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పాఠశాలలు ఈ నెల 13 ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక తరగతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి ఉన్నత పాఠశాలలో ఒక క్లాస్ రూమ్ ను కేటాయించాలని ఆర్వీఎం పీఓకు సూచించారు. గదులు అందుబాటులో లోని చోట ప్రత్యామ్నాయ భవనాలను ఏర్పాటు చేయాలన్నారు, ప్రతి రోజా ఈ కేంద్రాలను ఎంఈఓలు, రిసోర్సు పర్సన్లు తనిఖీ చేసి నివేదికలను, ఫొటోలను వాట్సప్ ద్వారా అందజేయాలని సూచించారు. సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బింద్రా , ఆర్వీఎం పీఓ యాస్మిన్ భాషా పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనానికి బ్రేక్
నిజామాబాద్(కమ్మారపల్లి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నీరుగారుతోంది. విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకానికి నిధుల కొరత బాధిస్తోంది. తాజాగా సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మారపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీ మహిళలు బిల్లులు చెల్లించడం లేదనే నెపంతో బోజన తయారీని నిలిపివేశారు. దీంతో సుమారు 350 మంది విద్యార్థులు తమ ఇళ్లకు వెళ్లి భోజనాలు చేయాల్సి వచ్చింది. భోజనం ఎందుకు అందివ్వలేదని ప్రశ్నించగా.. గత మూడు నెలలుగా తమకు బిల్లులు రావడం లేదని సొంత డబ్బులు ఖర్చు పెట్టి సరుకులు తీసుకు వచ్చే స్థోమత తమకు లేదని ఏజెన్సీ అధ్యక్షురాలు లక్ష్మి వాపోతున్నారు. -
‘కస్తూర్బా’తో తగ్గుతున్న డ్రాపౌట్స్
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంల ఏర్పాటుతో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బడి మానేసిన వారి ని చేర్పించి విద్యతోపాటు వృత్తివిద్యపై శిక్షణ ఇస్తున్నారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం 2009 జూన్‌లో ప్రారంభమైంది. ఆరంభంలో ఎనిమిది విద్యార్థులు చేరారు. అప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2011-12లో మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య ఉండగా.. 2012-13 నాటికి 20కి తగ్గింది. 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రస్తుతం 160 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యాలయాన్ని రూ.38.75లక్షలతో, అదనపు గదుల నిర్మాణాన్ని రూ.31.08లక్షలు, ఎఫ్ఎఫ్ నిధులు రూ.30లక్షలతో చేపట్టారు. విద్యార్థులకు కుట్టుశిక్షణ, అల్లికలు, ఎంబ్రయిడరీ, ఆటపాటలపై శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల దుస్తులు, జామెట్రిక్ బాక్స్, బ్లాంకెట్, కార్పెట్, పళ్లెం, గ్లాసు, ప్రతి నెలా తరగతి ఆధారంగా రూ.55 నుంచి రూ.75వరకు కాస్మోటిక్ చార్జీలు అందజేస్తున్నారు. ఫలితాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందిస్తున్నారు. బడిమానేసిన వారిని పాఠశాలలో చేర్పించి మెరుగైన విద్య అందిస్తున్నామని ఇన్చార్జి ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. -
సౌకర్యాలు కను‘మరుగు’
పాలమూరు, న్యూస్‌లైన్: అవస్థ..ఒక్కనాటిది కాదు..పాఠశాల నడిచినన్ని రోజులూ పంటి బిగువున భరించాల్సిందే. తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని చిన్నారులు ప్రతి రోజూ పడుతున్న వేదన ఇది. సరిగ్గా.. రెండేళ్ల క్రితం.. 2012 అక్టోబరు నెలలో సుప్రీం కోర్టు స్పం దించి తీవ్రంగా హెచ్చరించినా పాల కుల్లో స్పందన రాలేదు. సర్కారు బడు ల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం సాగడం లేదు. పాలమూరు జిల్లాలో 2,729 ప్రాథమిక పాఠశాలలుండగా, 580 వరకు ప్రాథమికోన్నత పాఠశాల లు, 643 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందుకుగాను పాఠశాలల నిర్వహణకోసం ఏటా రూ. 3.95కోట్లు నిధులు మంజూరవుతున్నా.. వాటి ఫలితాలు ఎక్కడా కనబడటం లేదు. గతంలో ని ర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టిసారించకపోవడంతో అవి ఉపయోగంలో లేకుండా పోతున్నా యి. జిల్లా వ్యాప్తంగా 1559 పాఠశాల ల్లోని విద్యార్థులు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. 2,948 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ప్రహరీల్లేవు. దీం తో ఆయా పాఠశాలలన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారా యి. 794 పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంలేదు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా 600 అదనపు తరగతి గదులు అవసరం. ఈ సంఖ్య కేవలం విద్యాశాఖ లెక్కల ప్రకారం మాత్రమే.. వాస్తవానికి చూస్తే 75 శాతం వరకు పాఠశాలల్లో తగిన మౌలిక వసతుల్లేక విద్యార్థినీ, విద్యార్థులు అవస్థపడుతున్నారు. సమన్వయలోపం ప్రభుత్వ శాఖల మధ్య ఏర్పడిన సమన్వయలోపం కారణంగా.. విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సర్కారు బడుల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన బాధ్యత ఆర్‌డబ్ల్యుఎస్ శాఖదేనని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు ఎప్పుడో నిర్మించాం. వా టిని మనుగడలో ఉంచుకోకపోవడానికి బా ధ్యులం తాము కాదని అయితే ఆ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా నిర్మాణాలు చేపడుతున్న కొత్త భవనాల వద్ద వారే టాయ్లెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నా రు. వీటి నిర్మాణం కోసం రెండేళ్లుగా నిధులు మంజూరు కావడం లేదని ఆ శాఖ అధికారి పేర్కొన్నారు. జిల్లాలోని అధికశాతం పాఠశాలల్లో మూత్రశాల లు, మరుగుదొడ్లు, కాం పౌండ్ వాల్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం ఏర్పా టు వంటివి లేకపోవడంతో విద్యార్థినులు అవస్థపడాల్సి వస్తోంది. పెరుగుతున్న డ్రాపౌట్లు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో విద్యార్థినులు అనేక అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు సక్రమంగా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. మరికొంత మంది పాఠశాలకు రావడం మానేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా.. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదు. ఉన్న కొన్ని మరుగుదొడ్ల లో నీటి వసతి లేవు. దీంతో అవి కూడా నిరుపయోగంగానే ఉంటున్నాయి.