యూనివర్సిటీ : ఫార్మసీ రంగంలో భారత్ అమెరికా కంటే ముందంజలో ఉందని జేఎన్‌టీయూ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. ఓటీఆర్‌ఐ కేంద్రంలో ‘అవెర్‌నెస్ ఆన్ ఫారిన్ యూనివర్సిటీస్ కొలాబిరేషన్ ఫర్ ఫార్మసీ కోర్సెస్’ అంశంపై గురువారం నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఓటీఆర్‌ఐ సంస్థ పటిష్టత కొరకు వర్సిటీ కృషి చేస్తోందన్నారు. ఇందులో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఫార్మసీ విభాగం పరిశోధనల ద్వారా మానవాళికి ఉపయోగపడుతాయన్నారు. అనంతరం కీనోట్ స్పీకర్‌గా మాట్లాడిన డాక్టర్ ఎం.చంద్రశేఖర్, యూనివర్సిటీ ఆఫ్ ఫిండ్‌లే,ఓహియో మాట్లాడుతూ.. ఫార్మసీ రంగంలో ప్రపంచంలోని తక్కిన దేశాల కంటే నాణ్యమైన పరిశోధనలు ఉన్నాయని అభిలషించారు. ఓటీఆర్‌ఐ డెరైక్టర్ ఆచార్య కేబీ.చంద్రశేఖర్, ఆచార్య వి.శంకర్, డాక్టర్ ప్రసాద్, ప్రోగ్రాం కో కన్వీనర్ శ్రీనివాస కృష్ణ, కో ఆర్డినేటర్స్ సంధ్యారాణి, జి.నేత్రావణి, సి.తిరుమలేష్ నాయక్, బాలకృష్ణ, రంగానాయక్, శ్రీధర్ పాల్గొన్నారు.
ఫార్మసీ రంగంలో భారత్ ముందంజ
Published Fri, Aug 7 2015 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement