అనంతపురం : అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో త్వరలో భారత్-పాక్ మధ్య వికలాంగుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు భారత జట్టు మాజీ కెప్టెన్, జాతీయ వికలాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజిత్ వాడేకర్ తెలిపారు. శనివారం 6వ అఖిల భారత ఇంటర్ జోనల్ వికలాంగుల క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురంలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్, ఆంధ్ర వికలాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫై, జాతీయ వికలాంగుల క్రికెట్ సంఘం కార్యదర్శి టిపి మిరాజ్‌కర్ తదితరులు పాల్గొన్నారు.