international cricket match
-
'కోహ్లి సెంచరీ సాధించే వరకు నేను పెళ్లి చేసుకోను'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. 2019లో చివర సారిగా బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ సాధించాడు. ఇక మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతోన్న తొలి టెస్ట్‌లో కోహ్లి తన కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధిస్తాడని అభిమానులు భావించారు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 45 పరుగులు మాత్రమే చేసి అభిమానులను మరోసారి కోహ్లి నిరాశపరిచాడు. అయితే మ్యాచ్ రెండో రోజు స్టేడియంలో ఓ అభిమాని పట్టుకున్న ప్లకార్డు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ప్లకార్డులో కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించే వరకు పెళ్లి చేసుకోనని ఆ అభిమాని పేర్కొన్నాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా కోహ్లి సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా అద్భుతమైన సెంచరీ సాదించాడు. 228 బంతుల్లో 175 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. చదవండి: India Vs Sri Lanka 1st Test: ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి టెస్ట్ లైవ్ అప్డేట్స్ -
అనంతపురంలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
అనంతపురం : అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో త్వరలో భారత్-పాక్ మధ్య వికలాంగుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు భారత జట్టు మాజీ కెప్టెన్, జాతీయ వికలాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజిత్ వాడేకర్ తెలిపారు. శనివారం 6వ అఖిల భారత ఇంటర్ జోనల్ వికలాంగుల క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురంలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్, ఆంధ్ర వికలాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫై, జాతీయ వికలాంగుల క్రికెట్ సంఘం కార్యదర్శి టిపి మిరాజ్కర్ తదితరులు పాల్గొన్నారు.