సగం పోస్టులు ఖాళీ!
Published Wed, Apr 9 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
విజయనగరం ఫూల్‌బాగ్ న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని పరిశ్రమల శాఖకు సిబ్బంది కొరత వేధిస్తోంది. అటెండర్ నుంచి జనరల్ మేనేజర్ వరకు పోస్టుల న్నీ ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పనులు కూడా సకాలంలో జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో చిరు వ్యాపారుల నుంచి పెద్ద మొ త్తంలో వ్యాపారం చేసుకునే వారు రుణాల కోసం పరిశ్రమల శాఖను ఆశ్రయిస్తుంటారు. అయితే కార్యాలయం లో తగిన సిబ్బంది లేకపోవడంతో వ్యాపారులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. సిబ్బంది ఎంత కష్టపడినా పనులు సకాలంలో జరగడం లేదు. కార్యాలయం లో సగం పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయడం లేదు.జనరల్ మేనేజర్ పోస్టు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. విశాఖపట్నం పరిశ్రమల శాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎస్‌వీ గిరిధరరావు ప్రస్తుతం ఇక్కడ డిప్యూటేషన్‌పై జీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ జీఎం లేకపోవడం తో రుణాల కోసం దరఖాస్తులు చేసుకునే వారు ఇబ్బం దులకు గురవుతున్నారు. వాస్తవానికి ఈ కార్యాలయంలో 9 మంది ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ (ఐపీఓ) ఉండాలి. కానీ న లుగురు మాత్రమే ఉన్నారు.
వీరి లో ఒకరు లీవ్‌లో ఉండడంతో ముగ్గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. స్టైనోలు నలుగురు కు గాను ఒక్కరే ఉన్నారు. ఇద్దరు టైపి స్టులు అవసరం కాగా ఒక్క రు కూడా లేరు. ముగ్గురు జూని యర్ అసిస్టెంట్లకు ఒక్కరు మా త్రమే ఉన్నారు. అలాగే ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఒక్కరే ఉన్నారు. డిప్యూటీ డెరైక్టర్ కోటేశ్వరరావు లీవ్‌లో ఉన్నా రు. దీంతో ఆ పోస్టు కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. అసిస్టెంట్ డెరైక్టర్లు మాత్రం ఉండాల్సిన ఇద్దరు ఉన్నారు. అటెండర్, వాచ్‌మెన్, స్వీపర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. తాత్కాలికంగా ఉన్న వాచ్‌మెనే..అటెండర్ వి ధులు కూడా నిర్వర్తిస్తున్నారు. అకౌంటెంట్ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఏళ్ల తరబడి పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఉన్న సిబ్బందిలో కూడా చాలామంది దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో మిగతావారు ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Advertisement