‘అనంత’ సస్యశ్యామలం | 'Infinite' evergreen | Sakshi
Sakshi News home page

‘అనంత’ సస్యశ్యామలం

Published Sat, Jul 4 2015 2:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

'Infinite' evergreen

సాక్షిప్రతినిధి, అనంతపురం: కృష్ణాజలాలతో ‘అనంత’ను సస్యశ్యామలం చేసి కరువు రహిత జిల్లాగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భ రోసా ఇచ్చారు. హంద్రీ-నీవా పనులను పరి శీలించేందుకు ఆయన శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్నారు. విహంగ వీక్షణం ద్వారా నీవా కాలువ నిర్మాణం, పనుల పురోగతితో పాటు పీఏబీఆర్ ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కృష్ణానది నిండగానే మొదటి ప్రాధాన్యత హంద్రీ-నీవాకే ఇచ్చి నీటిని ఎత్తిపోస్తామని చంద్రబాబు అన్నారు. ఈ నీటిని పీఏబీఆర్, మిడ్‌పెన్నార్ డ్యాం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అందిస్తామన్నారు. అలాగే కళ్యాణదుర్గంతో పాటు బీటీ ప్రాజెక్టు, హిందూపురం, మడకశిరకు కూడా నీ రిస్తామన్నారు. మరో 15 అడుగుల మేర లిప్ట్‌ను ఏర్పాటు చేస్తే ఏపీబీఆర్‌లోని తుంగభద్ర జలాలను హంద్రీ-నీవాకు మళ్లించొచ్చన్నారు. సోమశిలకు గోదావరి నీళ్లు అందించి, దాని ద్వారా నీటిని రాయలసీమకు అందించేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
 
 ఈ నీటి తో జిల్లాలోని అన్ని చెరువులను నింపుతామని భరోసా ఇచ్చారు. రైతులు సామాజిక బిందుసేద్యం ద్వారా ప్రతీనీటిబొట్టును వినియోగించుకోవాలని సూచించారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేస్తామన్నారు. పండ్లతోటలవైపు రైతుల దృష్టి మళ్లితే తప్ప వ్యవసాయంలో భవిష్యత్తు ఉండదని సీఎం సూచించారు. జీడిపల్లి రిజర్వాయర్ జిల్లా వ్యవసాయాభివృద్ధిలో అత్యంతకీలకం కాబోతోందన్నారు. హెచ్చెల్సీ వరదకాలువకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోలేదని, దీంతో కాలువ ఆధునికీకరణ పనులకు ఒప్పించామని, త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

 తేడా వస్తే కాంట్రాక్టర్లను
 బ్లాక్‌లిస్టులో పెడతాం: పనుల పరిశీలన సందర్భంగా సీఎం ఇరిగేషన్ సీఈ జలంధర్‌తో ప్రాజెక్టు పురోగతిపై ఆరా తీశారు. అనంతపురం, కర్నూలుకు 25 టీఎంసీ లు ఇచ్చి చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు మరో 30, 40 టీఎంసీలు తీసుకెళ్లాలని సీఎం అన్నా రు. కృష్ణానదికి వరద ఉధృతి అధికంగా ఉన్న సమయంలో 10 పంపులతో నీటిని ఎత్తిపోస్తే కాలువలు తట్టుకుంటాయా? అని ఆరా తీశారు. కాలువకు లైనింగ్ లేకపోవడంతో 10 పంపులు వినియోగిస్తే కాలువ తెగిపోతుందన్నారు. ఒకసారి పరిశీలించాలని సీఈకి సీఎం సూచించా రు. పనుల నాణ్యతపై రాజీపడేది లేదని, తేడా వస్తే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించారు.
 
 జీడిపల్లికి పునరావాసం కల్పించండి:
 రిజర్వాయర్‌లోని నీటితో జీడిపల్లి గ్రామంలో నీటిఊట ఉబుకుతోంది. దీంతో గ్రామస్తులం తా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై సీఎం మా ట్లాడుతూ ఆర్నెళ్లలో జీడిపల్లి వాసులకు పునరావాసం కల్పించాలన్నారు.
 
 వారికి అందాల్సిన ప రిహారం కూడా అందించాలని సూచించారు. సీ ఎం వెంట మంత్రి దేవినేని ఉమామహేశ్వరరా వు, ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, నిమ్మలకిష్టప్ప, ఎమ్మెల్యేలు బీకేపార్థసారథి, ప్రభాకర్‌చౌదరి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, ఎమ్మెల్సీలు పయ్యావుల, గుండుమల, మేయర్ స్వరూప, జెడ్పీ చైర్మన్ చమన్, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకట్రాముడు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement