మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్ , హె ల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్న నిరవధిక నిరాహా ర దీక్షను గురువారం రాత్రి 10.30గం’’ల సమయంలో పోలీసులు భగ్నం చేశారు. వ న్‌టౌన్ సిఐ బాలాజీ, టుటౌన్ సిఐ అప్పల నాయుడు, మహిళా పోలీస్టేషన్ సిఐ జ్యోతి లక్ష్మి ఆధ్వర్యంలో డిసిఎం, రెండు జీపుల తో, అధిక సంఖ్యలో పోలీసులు తరలివ చ్చి దీక్షలో ఉన్న వారిని అరెస్టు చేశారు.
అ రెస్టుకు నిరసనగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ని నాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీక్షలో కూర్చున్న వారిని అరెస్టు చేయనివ్వకుండా ఇతర కార్యకర్తలు, సిఐటియు నాయకులు వారికి అడ్డంగా ఉండి నినాదాలు చేశారు. అయినప్పటికి పోలీసులు అందరిని బలవంతంగా అరెస్టు చేశారు. గత మూడు రోజులుగా దీక్షలో కూర్చున్న వారి ఆరోగ్యాలు క్షీణించడంతో పోలీసులు నేరుగా వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
దీక్షలో కూర్చున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి.రఘు, సంఘం జిల్లా కార్యదర్శి ఏమేలమ్మ, జిల్లా నాయకురాళ్లు ఇందిరమ్మ, చంద్రకళ, సరళ, సునిత, నారాయణమ్మ, పుష్పలీల, వెంకటమ్మ, సుజాత, అనురాధ, జయమ్మ, కవితలను అరెస్టు చేయడంతో పాటు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు కిల్లేగోపాల్, సిఐటియు జిల్లా నాయకులు కురుమూర్తి, బాల్‌రెడ్డి, చంద్రకాంత్, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కిల్లేగోపాల్, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతమ్మ, ఏమేలమ్మలు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో నిరవధిక దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అక్రమంగా ఆరెస్టు చేయడం సరికాదన్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, డిమాండ్ల సాధనకు ఉధ్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
దీక్ష భగ్నం
Published Fri, Feb 14 2014 4:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement