గద్వాల/ గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పనుల టెండర్లను దక్కించుకోవడం కోసం మండలస్థాయి, గ్రామ స్థాయి నాయకులు బినామీ పేర్లతో నానాతంటాలు పడుతున్నారు. ఇదే తరహాలో శుక్రవారం గద్వాల పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయంలో జరిగిన టెండర్ల ప్రక్రియలో తొమ్మిది పనులకు కాంట్రాక్టర్లు ఏకమై అంచనా ధరకే షెడ్యూళ్లను వేశారు. మరో ఆరు పనులకు చర్చలు విఫలం కావడంతో లెస్‌కు టెండర్లను దాఖలు చేశారు.
గద్వాల పంచాయతీరాజ్ డివిజన్ పరిధిలో హాస్టళ్ల వంట గదులు, డైనింగ్ హాళ్లు, వ్యవసాయ గోదాం తదితర 15 రకాల పనులకు ’ కోటి ఐదు లక్షల విలువతో టెండర్లను పిలిచారు. ఈ పనులకు షెడ్యూల్‌ను ’ 1200తో అమ్మగా, 147 షెడ్యూళ్లను కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. టెండర్ల బాక్సులో 140 షెడ్యూళ్లను వేశారు. శుక్రవారం ఉదయం 12గంటల నుంచి ఈఈ కార్యాలయం వద్దకు చేరుకున్న బినామీ కాంట్రాక్టర్లు, షెడ్యూళ్లు కొన్న కాంట్రాక్టర్లు పనులను దక్కించుకునేందుకు సంప్రదింపులు చేపట్టారు. మా గ్రామంలో మా మండలంలో పనులు మేమే చేసుకుంటాం అంటూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టెండర్‌దారులను నయాన భయానా బెదిరింపులకు గురి చేశారు. మాట వినని వారికి తమ నాయకులతో ఫోన్లు చేయించి ఒప్పుకునేలా చేశారు. ఇలా ఒక్కొక్కరి వద్ద షెడ్యూళ్లు సేకరించి, నిర్ణీత అంచనా ధరకే కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. కార్యాలయానికి పక్కనే ఉన్న డిప్యూటీ ఈఈ కార్యాలయం ఆవరణలో కాంట్రాక్టర్లు బేరసారాలు జరుపుతున్నా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించారు.
పనుల వివరాలు...
అయిజలో హాస్టల్ భోజన గదికి రూ. 5.5 లక్షలు, మక్తల్‌లో హాస్టల్‌లో తాగునీటి వసతి కల్పించే పనులకు రూ. 5.20 లక్షలు, ఆత్మకూరులో హాస్టల్‌లో తాగునీటి వసతికి రూ. 5.25 లక్షలు, ఆత్మకూరులోని హాస్టల్‌లో తాగునీటి వసతికి రూ. 6.25 లక్షలు, మరో హాస్టల్ నందు టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 8.80 లక్షలు, అయిజలో హాస్టల్‌లో టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 8 లక్షలు, మరో హాస్టల్ లో బాత్‌రూంల నిర్మాణానికి రూ. 8 లక్షలు, ఆత్మకూరులో హాస్టల్‌లో బాత్‌రూం నిర్మాణానికి రూ. 5.2 లక్షలు, మరో హాస్టల్‌లో టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 5.2 లక్షలు, వడ్డేపల్లి మండలం రాజోలి హాస్టల్ లోు టాయిలెట్స్ నిర్మాణానికి రూ. 6.40 లక్షలు, బాత్‌రూంల నిర్మాణానికి రూ. 6.40 లక్షలు, ఇదే గ్రామంలో హాస్టల్ కాంపౌండ్ నిర్మాణానికి రూ. 7.70 లక్షలు, వడ్డేపల్లి మండలంలో రామాపురం హాస్టల్ కాంపౌండ్‌కు రూ. 9.72 లక్షలు, ఆత్మకూరు మండలం రేచింతలలో వ్యవసాయగోదాం నిర్మాణానికి రూ.
9 లక్షలు అంచనాలతో టెండర్లు పిలిచారు. ఈ పనులకు టెండర్లు శుక్రవారం సాయంత్రం ముగిశాయి.
టెండ‘రింగ్’!
Published Sat, Oct 26 2013 3:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement