
సాక్షి, అమరావతి : ఈ నెల 14 నుంచి ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4లక్షల 24 వేల 500 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. 922 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇక సప్లిమెంటరీతో పాటు లక్షా 75 వేల మంది ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు కూడా రాస్తున్నారని వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతాయని ఉదయలక్ష్మి చెప్పారు. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment