Inter supplementary
-
TG: ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (జనరల్)ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఫలితాలు (ఒకేషనల్)ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఫలితాలు (జనరల్)ఒక్క క్లిక్‌తో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సెకండ్ ఇయర్ ఫలితాలు (ఒకేషనల్) తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేసింది. మే 24న నుంచి జూన్ 3 వరకు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జరిగాయి. 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఫెయిల్ అయినవారితోపాటు ఇంప్రూమెంట్ కోసం పరీక్షలు రాసినవారు కూడా ఉన్నారు. -
మే 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి : ఈ నెల 14 నుంచి ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4లక్షల 24 వేల 500 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. 922 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఇక సప్లిమెంటరీతో పాటు లక్షా 75 వేల మంది ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు కూడా రాస్తున్నారని వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు కొనసాగుతాయని ఉదయలక్ష్మి చెప్పారు. జ్ఞానభూమి వెబ్సైట్లో హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. -
ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(మిడ్ డే మీల్స్) అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50 ఇంటర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని గంటా వెల్లడించారు. (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విద్యార్థి దారుణ హత్య
17 రోజుల తరువాత వెలుగులోకి.. స్నేహితులు హత్య చేసినట్లు అనుమానం ప్రేమ వ్యవహారమేకారణమా? బేతంచెర్ల: యం.పేండేకల్లు గ్రామంలో ఓ విద్యార్థి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన తోటి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముచ్చు పరమేశ్వరయ్య, రామేశ్వరమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు తిరుమలేష్ (19) ఇటీవల ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఈనెల 2వ తేదీన ఇంటి దగ్గర ఉండగా స్నేహితులు వచ్చి బయటకు తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో తెలిసిన బంధువుల ఇళ్లలో తల్లిదండ్రులు గాలించారు. ఆచూకీ కనిపించకపోవడంతో ఈనెల 6 వ తేదీన తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడిని గ్రామానికి చెందిన అతని స్నేహితులు మల్లేష్, కేశలనాయుడు, చిన్నరాజు వెంట తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యచేసి గ్రామ సమీపంలోని వెల్దుర్తి రోడ్డులో ఉన్న బావిలో పూడ్చివేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆదివారం డోన్ డీఎస్పీ బాబా పకృద్ధీన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ హనుమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మృత దేహాన్ని వెలికి తీశారు. అక్కడే తహశీల్దార్ అంజనాదేవి సమక్షంలో బనగానపల్లె డాక్టర్ శివశంకర్‌తో పోస్టుమార్టం చేయించారు. తిరుమలేష్ హత్య వార్త తెలుసుకున్న విద్యార్థి బంధువులు, గ్రామస్తులు ఘటన స్థలానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తమ కుమారుడిని అతని స్నేహితులే మట్టుబెట్టారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని గ్రామంలో చర్చించుకుంటున్నారు. -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జనరల్ కోర్సులకు సంబంధించిన పేపర్లన్నీ శనివారం సాయంత్రంతో ముగియగా.. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పేపర్లు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. వాటికి తక్కవ మంది విద్యార్థులు హాజరుకానుండటంతో అధికారులు వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వడంలేదు. శనివారం ఉదయం సెట్-3 ప్రశ్నపత్రంతో ప్రథమ సంవత్సరం విద్యార్థు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1 పరీక్షరాయగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా సెట్-3 ప్రశ్నపత్రంతోనే కామర్స్, కెమిస్ట్రీ పేపర్-2 పరీక్ష రాశారు. ఫస్టియర్ ఇంప్రూవ్మెంట్, నాన్ఇంప్రూవ్మెంట్కు కలిసి మొత్తం 12505 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 11712 మంది హాజరయ్యారు. సెకిండియర్ 2,146 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 184 మంది డుమ్మా కొట్టారు. కాగా ఒక్క మాల్‌ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
59 పరీక్షా కేంద్రాలు.. 28,150 మంది విద్యార్థులు 3 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఆర్ఐవో, డీఈసీ కన్వీనర్ అన్నమ్మ వెల్లడి శ్రీకాకుళం న్యూ కాలనీ: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం 2.30 నుంచి సా యంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తం గా 59 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షల కు 28,150మంది విద్యార్థులు హాజరుకానున్నా రు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో ఇంప్రూవ్‌మెంట్‌తో కలిపి 19,840 మంది, ఒకేషనల్ విభాగంలో 380, ఇక ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 7763, ఒకేషనల్‌లో 167 మంది పరీక్షలు రాయనున్నారు. మాస్ కాపీయింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి వార్షిక పరీక్షల మాదిరిగానే సప్లిమెంటరీ పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకుగాను పరీక్షల విభాగం డీఈసీ కన్వీనర్, ఆర్ఐవో ఎ.అన్నమ్మ నేతృత్వంలో ముగ్గురు డీఈసీ కమిటీ సభ్యులతోపాటు హైపవర్ కమిటీ, మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్, మరో ఐదు సిట్టింగ్ స్క్వాడ్ల ను, ఇతర సిబ్బం దిని నియమించారు. బల్క్ ఇన్చార్జ్గా ఒకరు వ్యవహరిస్తారు. 144 సెక్షన్ అమలు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు పోలీసు బందోబస్తును నియమిస్తున్నా రు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నేలపై పరీక్షలు రాసే లా కాకుండా ఫర్నిచర్‌తోపాటు వెలుతురు, తా గునీరు, ప్రాథమిక చికిత్స, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. సు దూర, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు తరలించేందుకు నిర్దేశించిన సమయాల్లో ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేసేం దుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టనుంది. -
ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు పూర్తి
శ్రీకాకుళం న్యూకాలనీ:ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో మార్కులను పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్) కోసం దరఖాస్తు చేస్తున్న 9,984 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 28,150 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో ఇంప్రూవ్మెంట్ కోసం 9,910 మంది, ఫెయిలైన విద్యార్థులు 9,930 మంది, ఒకేషనల్ విభాగంలో ఇంప్రూవ్మెంట్ కోసం 74 మంది, ఫెయిలైన విద్యార్థులు 306 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 7,763 మంది, ఒకేషనల్‌లో 167 మంది ఫెయిలైన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించారు. 59 కేంద్రాలు కేటాయింపు సప్లిమెంటరీ పరీక్షలను 59 కేంద్రాలను అధికారులు కేటాయించారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు జవాబుపత్రాలతోపాటు నామినల్‌రోల్స్, ఇతర మెటీరియల్‌ను చేరవేశారు. శ్రీకాకుళం పట్టణంలోనే తొమ్మిది కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకుగాను 59 మంది చీఫ్ సూపరింటెండెట్లు, 59 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, ఏసీవోలను నియమించారు. తనిఖీ బృందాల నియామకం పరీక్షల విభాగం డీఈసీ కన్వీనర్, ఆర్ఐవో ఎ.అన్నమ్మ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.యజ్ఞభూషణరావు(ప్రిన్సిపాల్ -టెక్కలి), బొడ్డేపల్లి మల్లేశ్వరరావు(ప్రిన్సిపాల్ -కోటబొమ్మాళి), జి.వి.జగన్నాథరావు (హిస్టరీ లెక్చరర్ -తొగరాం)తోపాటు హైపవర్ కమిటీ సభ్యులగా చౌదరి ఆదినారాయణ (ప్రిన్సిపాల్ -రణస్థలం)లను ఇంటర్‌బోర్డు నియమించిన విషయం తెలిసిందే. వీరితోపాటు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు మరో ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను, ఇతర సిబ్బందిని నియమించారు. అప్రమత్తంగా ఉండండి:ఆర్ఐవో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహనకు నియామకమైన సీఎస్‌లు, డీవోలు, కస్టోడియన్లు, ఏఎస్‌వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్ఐవో, డీఈసీ కమిటీ కన్వీనర్ ఎ.అన్నమ్మ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహన తీరుతెన్నులు, జాగ్రత్తలు తదితర అంశాలపై ఆమెతోపాటు డీఈసీ కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. పకడ్బందీగా పరీక్షలు శ్రీకాకుళం పాతబస్టాండ్:ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ -2 పి.రజనీకాంతారావు అన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం సంబంధిత ఆధికారులతో సమీక్ష నిర్వహించారు. మాస్ కాపియింగ్, అవకతవకలు జరగకుండా చూడాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టు మెంటల్ ఆధికారులు, పర్యవే క్షణలు చేయాలన్నారు. జంబ్లింగ్ విధానంలో భామిని నుంచి కొత్తూరు, కొత్తూరు నుంచి హిరమండలం, ఎల్ఎన్ పేట నుంచి హిరమండలం, పూండి నుంచి నౌపడ ఇలా కేంద్రాలను జంబ్లింగ్ చేసినట్టు చెప్పారు. సమావేశంలో ప్రాంతీయ పర్యవేక్షనాధికారి ఎ.అన్నమ్మ, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు బీవై భూషణరావు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్:జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగి శాయి. వాస్తవానికి గతనెల 25 నుంచి జరిగిన ఈ పరీక్షలు వాస్తవానికి జూన్ ఒకటితోనే ముగియూల్సి ఉంది. అయితే, గతనెల 29వ తేదీన తెలంగాణాలో బంద్ కారణంగా ఆరోజు జరగాల్సిన పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు 3వ తేదీన నిర్వహించింది. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు మొత్తం 60 కేంద్రాల్లో జరిగాయి. మేథ్స్ 1బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సెట్-3 పేపర్‌తో విద్యార్థులు పరీక్ష రాశారు. జనరల్ విభాగానికి 10,911 మంది హాజరుకావాల్సి ఉండగా 691 మంది, ఒకేషనల్‌కు 91 మంది హాజరుకావాల్సి ఉండగా 9 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు 55 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. మాథ్స్ 2బి, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సెట్-2 ప్రశ్నపత్రంతో విద్యార్థులు పరీక్ష రాయగా... జనరల్ విభాగంలో 2,783 మంది విద్యార్థులకు 152 మంది, ఒకేషనల్‌కు 48 మందికి ఇద్దరు గైర్హాజరయ్యారు. మొత్తంమీద ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి అన్ని విభాగాలకు కలిపి 854 మంది డుమ్మా కొట్టినట్లు అధికారులు ధ్రువీకరించారు. మాల్‌ప్రాక్టీసులు నిల్.. ఇదిలా ఉండగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసు కూడా నమోదుకాలేదు. గత ఐదేళ్ల తరువాత సప్లిమెంటరీ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీసులు నమోదుకాకపోవడం ఇదే తొలిసారని పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. చాలా కేంద్రాల్లో పది మంది విద్యార్థుల్లోపే పరీక్షలు రాశారు. ఈ సారి నేల రాతలు జరిగితే ఉపేక్షించేది లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన అధికారులు ఆచరణలో విఫలమయ్యూరు. కింతలి, పొందూరు, పాతపట్నం, జలుమూరు, టెక్కలి, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల తదితర ప్రాంతాల్లోని కళాశాలల్లో నేల రాతలు జరిగినా అధికారులు ప్రేక్షకపాత్ర వహించారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఏర్పాట్లు పూర్తి
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వాహ ణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల్లో 21,142 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్దమయ్యూరు. ఈ నెల 25 నుంచి జూన్ ఒకటి వరకు జరిగే ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ ఇంటర్ విద్యార్థులు 14,454 మందిలో బెటర్మెంట్ కోసం 6,792 మంది, ఫెయిల్యూర్స్ 7,662 మంది పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ రెండవ సంవత్సర విద్యార్థులు 9,911 మంది ఉన్నారు. ప్రథమ సంవత్స ర పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంట ల వరకు, రెండవ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు జరగనున్నారుు. 19న పర్యావరణ పరీక్ష : ఆర్ఐఓ బాబాజీ ఇంటర్లో పర్యావరణ సబ్జెక్టు పరీక్ష రాయని వారికి అవకాశం ఇస్తూ ఈ నెల 19న పరీక్ష నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ ఎల్‌ఆర్‌బాబాజీ ‘న్యూస్‌లైన్’కి చెప్పారు. గతంలో పరీక్షకు హాజరుకా ని వారు నేరుగా ఆ రోజు కళాశాలలకు వెళ్లి పరీ క్షకు హాజరుకావచ్చని తెలిపారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను పదింటిని గుర్తించామని, వీటితో పాటు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్షలను నిర్వహించడానికి 144వ సెక్షన్ విధిస్తున్నామని ఆర్ఐఓ చెప్పారు.