ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
59 పరీక్షా కేంద్రాలు.. 28,150 మంది విద్యార్థులు
3 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్‌ల నియామకం
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ఆర్‌ఐవో, డీఈసీ కన్వీనర్ అన్నమ్మ వెల్లడి
శ్రీకాకుళం న్యూ కాలనీ:
ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం 2.30 నుంచి సా యంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తం గా 59 పరీక్షా కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షల కు 28,150మంది విద్యార్థులు హాజరుకానున్నా రు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో ఇంప్రూవ్‌మెంట్‌తో కలిపి 19,840 మంది, ఒకేషనల్ విభాగంలో 380, ఇక ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 7763, ఒకేషనల్‌లో 167 మంది పరీక్షలు రాయనున్నారు.
మాస్ కాపీయింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
వార్షిక పరీక్షల మాదిరిగానే సప్లిమెంటరీ పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకుగాను పరీక్షల విభాగం డీఈసీ కన్వీనర్, ఆర్‌ఐవో ఎ.అన్నమ్మ నేతృత్వంలో ముగ్గురు డీఈసీ కమిటీ సభ్యులతోపాటు హైపవర్ కమిటీ, మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్, మరో ఐదు సిట్టింగ్ స్క్వాడ్‌ల ను, ఇతర సిబ్బం దిని నియమించారు. బల్క్ ఇన్‌చార్జ్‌గా ఒకరు వ్యవహరిస్తారు.
144 సెక్షన్ అమలు
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు పోలీసు బందోబస్తును నియమిస్తున్నా రు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నేలపై పరీక్షలు రాసే లా కాకుండా ఫర్నిచర్‌తోపాటు వెలుతురు, తా గునీరు, ప్రాథమిక చికిత్స, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. సు దూర, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు తరలించేందుకు నిర్దేశించిన సమయాల్లో ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులను మూసివేసేం దుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టనుంది.