ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జనరల్ కోర్సులకు సంబంధించిన పేపర్లన్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జనరల్ కోర్సులకు సంబంధించిన పేపర్లన్నీ శనివారం సాయంత్రంతో ముగియగా.. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పేపర్లు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయి. వాటికి తక్కవ మంది విద్యార్థులు హాజరుకానుండటంతో అధికారులు వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వడంలేదు. శనివారం ఉదయం సెట్-3 ప్రశ్నపత్రంతో ప్రథమ సంవత్సరం విద్యార్థు కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1 పరీక్షరాయగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా సెట్-3 ప్రశ్నపత్రంతోనే కామర్స్, కెమిస్ట్రీ పేపర్-2 పరీక్ష రాశారు. ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్, నాన్‌ఇంప్రూవ్‌మెంట్‌కు కలిసి మొత్తం 12505 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 11712 మంది హాజరయ్యారు. సెకిండియర్ 2,146 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 184 మంది డుమ్మా కొట్టారు. కాగా ఒక్క మాల్‌ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.