నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: పేదరిక నిర్మూలనకు కృషి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సిన మెప్మా అధికారులు వింత పోకడలకు తెరదీశారు. ఇక్కడ పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రెగ్యులర్ అధికారుల వరకు ప్రతి ఫైల్‌కు ఓ రేటు నిర్ణయించి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసూళ్ల దందాతో మహిళా సంఘాల సభ్యులు విసుగెత్తి పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రజల నుంచి వసూలు చేస్తుండగా పైస్థాయి వారు సంబంధిత ఉద్యోగుల నుంచి అప్పనంగా రాబట్టుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. కింది స్థాయిలో జరిగే అక్రమాలపై మెప్మా జిల్లా అధికారులు ప్రశ్నించాల్సింది పోయి మిన్నకుండి పోతున్నారు. పైగా వారే చేయి చాచి అడుక్కునే పరిస్థితికి దిగజారారని పలువురు ఆరోపిస్తున్నారు.
మా దృష్టికి రాలేదు : వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ
కార్యాలయంలోని ఉద్యోగులపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని మెప్మా పీడీ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఎండీకీ ఫిర్యాదు చేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. సూర్యాపేట, మిర్యాలగూడ సిబ్బందిపై ఫిర్యాదులు అందితే.. కలెక్టర్‌కు నివేదించామని వివరించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, ఎట్టి పరిస్థితుల్లో వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
మెప్మా.. ఇదేంటమ్మా?
Published Sat, Dec 21 2013 2:48 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement