హన్మకొండ టౌన్, న్యూస్‌లైన్ : నీటి పారుదల శాఖలో లం చం తీసుకుంటూ జైలు పాలైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ మండలం మడికొండలోని చెరువు మరమ్మతుల పనిని టెండర్ ద్వారా కాం ట్రాక్టర్ దక్కించుకున్నారు. ఈ పని చేపట్టేందుకు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని వరంగల్ డివిజన్ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తు న్న రంగరాజు శ్యాంసుందర్‌రావు, ఏటీఓగా పనిచేస్తున్న కూరపాటి రాజేశ్వర్‌రావును కాంట్రాక్టర్ సంప్రదించారు. అయితే, పని మొత్తానికి ఒక శాతం పర్సంటేజీల రూపంలో లంచం ఇస్తే తప్ప... వర్క్ ఆర్డర్ ఇచ్చేలేదని అధికారులు చెప్పడంతో సద రు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
వీరిని జైలుకు తరలించారు. 48గంటల పాటు ఏ ప్రభుత్వ ఉద్యోగైనా పోలీస్ కస్టడీలో ఉంటే సర్వీసు రూల్స్ ప్రకారం సస్పెండ్‌కు గురవుతారు. ఏసీబీ అధికారుల సిఫారసు మేరకు సర్వీసు నిబంధనల ప్రకారం ఇరువురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. వీరు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇద్దరు ఇరిగేషన్ అధికారుల సస్పెన్షన్
Published Sat, Aug 24 2013 4:59 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement