ఈ వికలాంగుడు చనిపోయాడట! | is disabled person alive ? | Sakshi
Sakshi News home page

ఈ వికలాంగుడు చనిపోయాడట!

Published Tue, Feb 25 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

ఈ వికలాంగుడు చనిపోయాడట!

ఈ వికలాంగుడు చనిపోయాడట!

ఎమ్మిగనూరురూరల్, న్యూస్‌లైన్: రోడ్డుపై ఓ వికలాంగులు అష్టకష్టాలు పడుతూ నడుచుకుంటూ వస్తున్నాడు కదూ.. మనందరికీ కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని అధికారులు మాత్రం చూడలేకపోతున్నారు.. మండల పరిధిలోని మసీదపురానికి చెందిన వికలాంగులు నరసింహులు 2012 జూన్‌లోనే చనిపోయాడంటూ అధికారులు పింఛన్‌ను రద్దు చేశారు. తాను బతికే ఉన్నానని.. పింఛన్ పునరుద్ధరించి ఆదుకోవాలని కోరుతున్నా వారికి పట్టడం లేదు.
 
 ఈ నేపథ్యంలో సోమవారం మళ్లీ ఎంపీడీఓ పద్మజను ఆమె కార్యాలయంలో కలిసి ఫించన్ మంజూరు చేయాలని కోరాడు. అధికారులు మాట్లాడుతూ ‘డీఆర్‌డీఏ అధికారులకు వివరాలు పంపాం.. వస్తే ఇస్తాం’ అంటు సమాధానమిచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కంప్యూటర్‌లో తన పింఛన్ ఐడీ నం. 503447 కొడితే చనిపోయినట్లు వస్తుందని వాపోయాడు. మూడు చక్రాల వాహనం కూడా లేదని, జిల్లా అధికారులు స్పందించి తనకు పింఛన్, ట్రైసైకిల్ ఇవ్వాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement