సాక్షి, హైదరాబాద్ : డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ లొంగుబాటు గడువు ముగిసింది. 24 గంటల్లో లొంగిపోవాలని సైబరాబాద్ పోలీసులు సోమవారం అశోక్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే 24 గంటలు గడిచినా నోటీసులకు అశోక్ స్పందించలేదు .దీంతో తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అశోక్ ఆచూకి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మరో వైపు సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు అమెజాన్, గూగుల్ సంస్థలు స్పందిచాయి. రెండు రోజుల్లో ఐటీ గ్రిడ్స్ డేటాపై పూర్తి వివరాలు ఇస్తామని చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment