జగన్ కలల సీమాంధ్ర
జగన్ కలల సీమాంధ్ర
Published Sat, May 3 2014 11:17 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
సీమాంధ్ర అభివృద్ధికి రాచబాట ఏది? ఎలా సీమాంధ్రను దేశంలోని అత్యంత సమృద్ధ రాష్ట్రాల్లో ఒకటిగా మార్చాలి. దీనిపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన అవగాహన ఉంది. నిజానికి ఇది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల. ఆయన మార్గదర్శకత్వంలో పలువురు నిపుణులు, సీనియర్ రాజకీయ నేతలు కలిసి ఒక డాక్యుమెంటును రూపొందిస్తున్నారు. సీమాంధ్ర పునర్నిర్మాణం పై జగన్ స్వప్నమేమిటి?
సీమాంధ్ర అభివృద్ధి వ్యూహం
ఈ డాక్యుమెంటులో సీమాంధ్ర సర్వతోముఖాభివృద్ధికి తొమ్మిది మూలస్తంభాలను గురించి ప్రస్తావించారు. అవి:
* ప్రపంచ స్థాయి రాజధాని - అంతర్జాతీయంగా సీమాంధ్ర రాజధానికి గుర్తింపు తెచ్చేలా ఒక కట్టడం తయారు కావాలి. వాషింగ్టన్ లింకన్ మెమోరియల్, ముంబాయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా ఎలా ఉన్నాయో అలాంటి రాజధాని కావాలి.
* ఇండస్ట్రియల్ కారిడార్ - ఏడాదికి 40 వేల కోట్ల ఆదాయాన్నివ్వగల సామర్థ్యం ఉన్న పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలి. పెట్రో కెమికల్, మైనింగ్, ఉత్పాద, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయాధారిత పరిశ్రమలు, లెదర్, టెక్స్ టైల్ పరిశ్రమలు, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, కోల్డ్ స్టోరేజ్ చెయిన్ ల ద్వారా పారిశ్రామికాభివృద్ధి.
* కనెక్టివిటీ - అయిదు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు, ఆసియాలోనే అతి పెద్ద ప్రైవేటు పోర్టు, హై స్పీడు రోడ్లు, జాతీయ జల మార్గాలతో ప్రతి గ్రామాన్ని కలిపే కనెక్టివిటీ
* విద్యుత్ సరఫరా - విండ్ ఫన్నెల్ టెక్నాలజీ ద్వారా, ఎనిమిది థర్మల్ విద్యుత్ కేంద్రాల సాయంతో రాబోయే పదేళ్లలో రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి.
* టూరిజం అభివృద్ధి - సీమాంధ్రకు దేవుడు మూడు ఎస్ లను ఇచ్చాడు. అవే సన్ (చక్కని సూర్యరశ్మి), సాండ్ (ఇసుక తిన్నెలు), షోర్ (సాగర తీరాలు) వీటితో పాటు బుద్ధిస్ట్ టూరిజంను, వాటర్ టూరిజం ను అభివృద్ధి చేస్తే అయిదు లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు.
* వ్యవసాయ రంగం అభివృద్ధి - అన్నపూర్ణ లాంటి రాష్ట్రం అందరి ఆకలి తీర్చేలా ప్రతి ఎకరాన్నీ సంసిద్ధం చేయడం.
* మెరుగైన నీటిపారుదల - సీమాంధ్రకు నీటి కొరత లేకుండా చేయడం
* మెరుగైన వైద్య సేవలు - సీమాంధ్ర లో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆస్పత్రుల నిర్మాణం. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రాజధానిలో ఇరవై సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు.
* మెరుగైన విద్య సదుపాయాలు - సీమాంధ్రను దేశానికే విద్యా రాజధానిగా ఎదగగలిగే సామర్థ్యం ఉంది. ఆ దిశగా మెరుగైన సదుపాయాలను కల్పించడం.
ఈ తొమ్మిది అంశాల సమన్విత ప్రగతితో ప్రస్తుతం ఉన్న 7 శాతం స్థూల రాష్ట్ర ఉత్పత్తి నుంచి 9 శాతానికి చేరాలన్నదే వైఎస్ జగన్ స్వప్నం.
Advertisement
Advertisement