జై తెలంగాణ అంటే టైజమా..
Published Sun, Sep 8 2013 11:39 PM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM
సిద్దిపేట టౌన్,న్యూస్‌లైన్:జై తెలంగాణ నినాదాలు చేస్తే పాశవికంగా దాడిచేస్తారా..? ఈ హక్కు వారికి ఎవరిచ్చారు..? తెలంగాణ పదమంటే టైజమా..? దేశద్రోహమా..? నేరమా..? గుండె రగులుతోందని రాష్ట్ర సీనియర్ మంత్రి జె. గీతారెడ్డి మండిపడ్డారు. సిద్దిపేటలో ఆదివారం సాయంత్రం విలేకరులతో ఆమె మాట్లాడుతూ సేవ్ ఏపీ సభ సందర్భంగా పోలీసులు హద్దులు మీరి ప్రవర్తించారన్నారు. తెలంగాణ పోలీసులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలం, విద్యార్థి నేత బాల్‌రాజు, నిజాం కళాశాల విద్యార్థులపై జరిగిన దాడులకు సంబందించి విచారణ జరగాలని భాద్యులైన వారిని శిక్షించాలన్నారు. ఈ సంఘటనలపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణలో తెలంగాణ నినాదం చేసే హక్కును కోల్పోమన్నారు. తెలంగాణ సహనం, మంచితనం వల్లనే సేవ్ ఏపీ సభ సాఫీగా జరిగిందన్నారు. రెచ్చగొట్టే చర్యలు మంచి ఫలితాలు ఇవ్వవన్నారు. సఖ్యత లేనప్పుడు పోలీసులు సున్నితంగా, ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాలన్నారు.
Advertisement