సాక్షి, తూర్పు గోదావరి: రాజమండ్రిలో దివంగత నేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం వద్ద రామ్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం, కర్రి పాపారాయడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment