సాక్షి, హైదరాబాద్: సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జనసేన ట్విట్టర్ లో ప్రత్యక్షమైన ట్వీట్ చూస్తే ఇలాంటి అభిప్రాయం కలుగుతోంది. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో ఘన విజయం కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్న జనసేన పార్టీ కొత్త నినాదం ఇదే కావచ్చు అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.
అధినేత పవన్ మనస్సులో ఏముందో స్పష్టం కానప్పటికీ ఆయన పార్టీ ట్వట్టర్ పేజ్‌లో కనిపించిన స్లోగన్ మాత్రం ఆసక్తికరంగా నిలిచింది. ‘‘అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే గానీ కాళ్ళు అయితే వెనక్కి పడదు " ఇది జనసేన ట్వీట్. అయితే తమ హీరో సినిమా మార్క్ పంచ్ డైలాగును మించి ఈ స్లోగన్ ఉండటంతో అభిమానులు,పార్టీ కార్యకర్తలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.
అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే కానీ కాళ్లు అయితే వెనక్కి పడదు - #JanaSenaParty Chief @PawanKalyan pic.twitter.com/hNqisVMgn3
— JanaSena Party (@JanaSenaParty) September 19, 2017