వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా: జేసీ | JC Diwakar Reddy Ready to Resign his MP Post | Sakshi
Sakshi News home page

బుధవారం ఎంపీ పదవికి రాజీనామా: జేసీ

Published Thu, Sep 21 2017 2:06 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా: జేసీ

వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా: జేసీ

సాక్షి, అనంతపురం : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎంపీగా ఫెయిల్‌ అయినట్లు తన మనస్సాక్షి చెబుతోందని, అందుకే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. చాగల్లుకు నీళ్లు తేలేని తానకు ఎంపీ పదవి ఎందుకని అన్నారు. తాడిపత్రి సాగు, తాగు నీటి అవసరాలను తీర్చలేకపోయానని, అలాగే అనంతపురంలో రోడ్లను విస్తరించలేకపోయినట్లు చెప్పారు.

తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని, ప్రజల మద్దతుతోనే ఎంపీ అయ్యాయని అన్నారు. తనలాంటివాళ్లు రాజకీయాల్లో ఉండటం వృథా అని, విలువలేనప్పుడు పదవిలో కొనసాగడం భావ్యం కాదని తెలిపారు. ఈనెల 25 లేదా 26న ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్‌కు అందజేస్తానన్నారు. అయితే పదవికి మాత్రమే రాజీనామా చేస్తానని, పార్టీకి కాదని ఆయన తెలిపారు. తాను పదవికి రాజీనామా చేసినా చంద్రబాబు వెంటే ఉంటానని జేసీ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement