అనంతపురం: తాడిపత్రి పోలీసు స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం సృష్టించారు. తన అనుచరుడు శివనాయుడు విడుదల చేయాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి అనంతపురం మేయర్ స్వరూప బుధవారం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా విమర్శించినందుకు మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలకు జేసీ అనుచరుడు శివనాయుడు ఫోన్ చేసి బెదిరించారు. దీనిపై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శివనాయుడిని అరెస్టు చేశారు. అయితే, తన అనుచరుడినే అరెస్టు చేస్తారా అంటూ ఎమ్మెల్యే జేసీ పోలీసు స్టేషన్‌లో వీరంగం సృష్టించారు.
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపలను బెదిరించిన కేసులసో జేసీ వర్గీయుడు శివనాయుడిని అరెస్టుచేశామని, అయితే, స్టేషన్ బెయిల్ మీద ఆయనను విడుదల చేశామని తాడిపత్రి సీఐ మురళీకృష్ణ చెప్తున్నారు. ఈ వ్యవహారంలో తాడిపత్రి పోలీసులను జేసీ వర్గీయులు బండబూతులు తిట్టారు.
Comments
Please login to add a commentAdd a comment