'దొనకొండ ప్రస్తావనతో టీడీపీ నేతల్లో మంటపుట్టింది' | JD Seelam condemned tdp leaders allegations | Sakshi
Sakshi News home page

'దొనకొండ ప్రస్తావనతో టీడీపీ నేతల్లో మంటపుట్టింది'

Published Sun, Aug 31 2014 2:10 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'దొనకొండ ప్రస్తావనతో టీడీపీ నేతల్లో మంటపుట్టింది' - Sakshi

'దొనకొండ ప్రస్తావనతో టీడీపీ నేతల్లో మంటపుట్టింది'

కాకినాడ: రాష్ట్ర రాజధానిపై ఏర్పాటైన ప్రొ.శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో రాజదానిగా దొనకొండ పేరును ప్రస్తావించడంతో టీడీపీ నేతల్లో మంటపుట్టుకొచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం ఎద్దేవా చేశారు. ఆదివారం కాకినాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో సమావేశంలో జేడీ శీలం ప్రసంగిస్తూ.... శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కాంగ్రెస్ పార్టీ కుట్రేనని టీడీపీ నేతల ఆరోపణను ఈ సందర్బంగా ఆయన ఖండించారు.

సోనియా గాంధీయే స్వయంగా ఆ కమిటీని పిలిపించి నివేదిక రాయించిందని టీడీపీ నేతల ఆరోపణలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. విభజనకు మీరే కారణమంటూ అందరు మమ్మల్ని విమర్శిస్తున్నా... తాము మాత్రం మౌనంగానే ఉన్నామని శీలం ఆవేదనతో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement