
తనిఖీలు చేస్తున్న జాయింట్ కలెక్టర్–2 పిడుగుబాబురావు తదితరులు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమం): సినిమా హాళ్లలలో నిర్ధేశించిన ధరల కంటే అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ 2 పిడుగు బాబురావు స్టాళ్ల యజమానులను హెచ్చరించారు. మంగళవారం నగరంలోని పి.వి.పి మాల్, పి.వి.ఆర్ సినిమా హాళ్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాల్స్‌లోని స్టాళ్లలలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించారు. తాగునీరు, సమోసా, పాప్‌కార్న్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. నగరంలో ఉన్నటువంటి సినిమా హాళ్లలో ఎట్టి పరిస్థితుల్లో అదనపు ధరలను సహించబోమన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆహార పదార్థాలు విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు. ఇటువంటి స్టాళ్లకు నోటీసులు అందిస్తామన్నారు. ఆయన వెంట అర్బన్ తహసీల్దార్ రవీంద్రబాబు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.