
పర్యాటక మంత్రి అఖిల ప్రియ నుంచి అవార్డు అందుకుంటున్న దీపికా పదుకునే
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియా అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం విజయవాడలో సందడిగా సాగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సౌత్ ఇండియా సోషల్ మీడియా బెస్ట్ హీరోగా దగ్గుబాటి రానాకు, సోషల్ మీడియా బెస్ట్ హీరోయిన్‌గా దీపికా పదుకునేకు పురస్కారాలు లభించాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఈ అవార్డులను అందజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇలాంటి అవార్డుల ప్రదానోత్సవం జరగడం ఇదే తొలిసారి అని ఆమె అన్నారు.దగ్గుబాటి రానా మాట్లాడుతూ తనకు అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment