ప్రకాశం: జిల్లాలోని కొమరోలులో సమైక్యాంధ్రాకు మద్దతుగా జర్నలిస్టులు, విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నిరసన జ్వాలలు ఎనిమిదో రోజు కూడా యధాతథంగానే కొనసాగుతున్నాయి. గత కొన్నిరోజులుగా సీమాంధ్ర జిల్లాలోని పలుచోట్ల సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు.
వీరికి తోడుగా విద్యార్థులు పాదం కలపడంతో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.