సీమ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలి
కర్నూలు(టౌన్): వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శనివారం స్థానిక మౌర్య ఇన్‌లో రాయలసీమ అభివృద్ధి - మీడియా పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక సీఎంలు రాయలసీమవాసులే కావడం గర్వకారణమన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ ప్రపంచంలో తిరిగి రాయలేని చరిత్ర మీడియాకు ఉందన్నారు. మంచి పనులకు రాజకీయ నాయకులు, జర ్నలిస్టులు సహకారం అందించాలన్నారు. సదస్సులో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, రాష్ట్ర నాయకుడు కృపావరం, వివిధ పత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
సదస్సు అనంతరం ఏపీజేఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా హరినాథ్‌రెడ్డిలతో పాటు మరో 25 మందిని ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు.