జూనియర్ అసిస్టెంట్ హత్య | Junior Assistant murder | Sakshi
Sakshi News home page

జూనియర్ అసిస్టెంట్ హత్య

Published Tue, Jan 20 2015 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన సాంబశివరావును బొబ్బిలిలోని ఆయన ఇంట్లో ఆదివారం రాత్రి హత్య చేసిన అనంతరం దుండగులు

బొబ్బిలి:  కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన సాంబశివరావును బొబ్బిలిలోని ఆయన ఇంట్లో ఆదివారం రాత్రి హత్య చేసిన అనంతరం  దుండగులు ప్రధాన ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దేని కోసం ఎవరు ఈ హత్యను చేశారో  అంతా మిస్టరీగా ఉంది.  ఆయన బొబ్బిలి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సమీపాన ఓ  ఇంట్లో ఉంటూ గత ఏడాది ఆగస్టులోనే నాయుడుకాలనీలోని శ్రీగాయత్రి డిగ్రీ కళాశాల పక్కనున్న ఇంటికి వచ్చారు. సాంబశివరావు కుమార్తె ప్రశాంతికి గత ఏడాది వివాహం చేశారు. కుమార్తె, అల్లుడు బంగ్లాదేశ్‌లో ఉండడంతో వారికి సహాయం కోసం భార్య రేణుక ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు.
 
 ఇటీవల సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో సాంబశివరావు తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లి సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఆదివారం సాయంత్రానికి బొబ్బిలి చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆయన స్కూలుకు రాకపోవడం, భార్య రేణుక బంగ్లాదేశ్ నుంచి ఫోన్ చేస్తున్నా ఎత్తకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. బయట తాళం వేసి ఉన్నా చుట్టుపక్కల ఎక్కడా ఆయన జాడ లేకపోవడంతో ఇంటి వెనుకవైపు కిటికీ తలుపులు తీసి చూడగా రక్తపు మడుగులో సాంబశివరావు కనిపించారు. దీంతో  చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ టి సీతారాం, ఎస్సై నాయుడులు వచ్చి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. విజయనగరం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వచ్చిన తరువాత ఇంటి తాళాలు పగులగొట్టారు.
 
 ప్రొఫెషనల్స్ పనే..
 చంపడానికి కారణం స్పష్టంగా తెలియకపోయినా అక్కడ సంఘటన స్తలం చూస్తే నేరాల్లో ప్రావీణ్యం ఉన్న వారే చేసినట్లు అర్థమవుతోంది.. డాగ్ స్క్వాడ్ వచ్చినా ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ఉండేందుకు మృతదేహం నుంచి ఇంటి గుమ్మం వరకూ కారం, మసాలా పొడిని జల్లారు.. వాల్‌కుర్చీ పక్కన మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసి ఉన్నాయి. టీవీ, వీసీడీలు ఆన్‌చేయగానే నీలిచిత్రాలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సాంబశివరావు ఆదివారం రాత్రి నీలిచిత్రాలు వేసుకుని గడిపినట్లు అనుమానిస్తున్నారు.  ఆయన శరీరంపై వస్త్రాలేవీ లేకపోవడంతో రాత్రి వేళ ఎవరైనా మహిళతో పాటు మరికొందరు ఈ హత్యలో భాగస్వాములయ్యారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
 
 రక్తపు మడుగు వద్ద పరిసర ప్రాంతాల్లో పాదాల గుర్తులు ఉండడంతో ఈ హత్య ఒక్కరు చేసిన పని కాదని తెలుస్తోంది. విజయనగరం నుంచి వచ్చిన డాగ్‌స్క్వాడ్ మొదటి సారి గాయత్రి కళాశాల లోపలనుంచి కోడి చెరువు పక్క నుంచి రైలు పట్టాలవైపు పరుగులు తీసింది. మృతదేహాన్ని పరిశీలించిన తరువాత ఇంటి పక్క నుంచి వెళ్లి నాయుడు కాలనీలోపల నుంచి మళ్లీ అదే ప్రదేశానికి వచ్చింది. హత్యకు ఉపయోగించిన చాక్ సంఘటనా స్థలంలోనే ఉంది. ఆ ప్రదేశంలో రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
 
 సాంబశివరావుకు ఒకటే ఫోన్ ఉందని చెబుతున్నారు అలాంటప్పుడు రెండో ఫోన్ నిందితులదేనని అనుమానం కలుగుతోంది. ఇంట్లో డబ్బు, బంగారం కోసం సాంబశివరావును హత్య చేశారనుకుంటే  ఇంట్లో ఉన్న బీరువాలేవీ ముట్టుకున్న దాఖలాల్లేవు. దీంతో ఫోన్ కాల్‌లిస్టు ఆధారంగా దర్యాప్తు చేస్తామని సీఐ సీతారాం తెలిపారు. హైస్కూలులో పనిచేస్తున్న సహచరుడు దారుణ హత్యకు గురయ్యాడ ని తెలియగానే ఉపాధ్యాయులంతా సంఘ టనా స్థలానికి చేరుకున్నారు.పాఠశాల కరస్పాండెంట్, ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు సంఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement