జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా అనుసరిస్తున్న తీరుపట్ల ప్రొఫెసర్ కంచ ఐలయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా అనుసరిస్తున్న తీరుపట్ల ప్రొఫెసర్ కంచ ఐలయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మా ట్లాడారు. పవన్ బీజేపీ నేత నరేంద్ర మోడీని కలసి మద్దతును ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘నేను నిరంతరం బీజేపీ వల్ల కలిగే నష్టాలను ఎత్తి చూపుతుంటే దాన్ని అర్థం చేసుకోకుండా పవన్ ఆ పార్టీకి మద్దతు ప్రకటించడం విచారకరం’ అని పేర్కొన్నారు.