‘బ్యాంకుల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి’
రాజమండ్రి : రైతుల డబ్బు బ్యాంకుల్లో ఉన్నా వాళ్లు తీసుకోలేని పరిస్థితి దారుణమని తూర్పు గోదావరి జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జిల్లావ‍్యాప్తంగా రూ.627 కోట్ల ధాన్యం అమ్మకాల సొమ్మును రైతులు జమ చేశారన్నారు.
కానీ రైతులు రైతులు ఒక్క రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితి తలెత్తిందన్నారు. మరో 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, దాని పరిస్థితి ఏంటని కన్నబాబు ప్రశ్నించారు. పింఛన్లు నగదు రూపంలో ఇవ్వాలని, నగదు కష్టాలకు ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.