సురవరం, నారాయణలకు కేసీఆర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ తరఫున రాజ్యసభ బరిలోకి దిగిన కె.కేశవరావు గెలుపొందేందుకు సహకరించినందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కేసీఆర్ వారికి ఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొట్టమెదటి సారిగా పెద్దల సభలో టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం దక్కినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.