ఖమ్మం, న్యూస్‌లైన్: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి భారంగా బతుకు బం డిని ఈడుస్తున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి అదన పు భారం మోపడంతో విపక్షా లు భగ్గుమన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఖమ్మం, ఇల్లెందు, భద్రాచలం ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలపై భారం మోపడమే ధ్యేయంగా పనిచేస్తోందని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలను, ప్రజలకు భారంగా మారిన పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సరైన సమయంలో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెపుతారని అన్నారు.
ఖమ్మంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్‌లో ఆందోళన నిర్వంచారు. పార్టీ కార్యాలయం నుంచి మహిళలు బయలుదేరి జడ్పీ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు ఎండీ ముస్తాఫా, మహిళా నాయకురాళ్లు కొత్తకొండ శ్రీలక్ష్మీ, పద్మజారెడ్డి, షకీనా తదితరులు పాల్గొన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో సరిత క్లినిక్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో బత్తుల హైమావతి, మచ్చా లక్ష్మి, అఫ్రోజ్‌షమీనా, గట్టు రమాదేవి, ఉమా మ హేశ్వరి, అమరావతి, రమ్య తదితరులు పా ల్గొన్నారు. సీపీఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎండీ సలాం ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ రోడ్డులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డులో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల వెంకటేశ్వర్లు, జి. రామయ్య, శ్రీని వాస్, మంగతాయి, శిరోమణి పాల్గొన్నారు.
భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గ్యాస్ ధరలను తగ్గించేంత వరకూ తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. గ్యాస్ ధర పెంపు పట్ల నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రేగలగడ్డ ముత్తయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరను వె ంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు, గార్ల, బయ్యారం, కామేపల్లి మండల కేంద్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇల్లెందులో జరిగిన కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, ఆయా మండలాల్లో మండల కార్యదర్శులు పాల్గొన్నారు. ఇల్లెందులో పార్టీ జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ, డివిజన్ నాయకులు దేవులపల్లి యాకయ్య, బయ్యారంలో మండా రాజన్న, కామేపల్లిలో వింజం నాగభూషణం పాల్గొన్నారు.
భగ్గుమన్న విపక్షాలు
Published Fri, Jan 3 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement