మధిర, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్‌లో రూ. 520 కోట్ల వ్యవసాయ రుణాలు అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక డీసీసీ బ్యాంకులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది రైతులకు రూ. 420 కోట్ల రుణాలు ఇచ్చామని, మరో వందకోట్లు కలిపి ఈ ఖరీఫ్‌లో లక్షా 42వేల మంది రైతులకు రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ. 400 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చామని, మరో రూ. 120 కోట్లు ఇవాల్సి ఉందన్నారు. ఈ ఏడాది రూ. 100 కోట్ల వాణిజ్య రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరు ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, రూ. 6లక్షల రుణం మంజూరుచేస్తామన్నారు. పొలానికి సంబంధించి టైటిల్ డీడ్, పాస్‌బుక్ విధిగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో రూ. 56 లక్షలతో రైతు సంక్షేమ నిధిని ఏర్పాటుచేశామన్నారు. విపత్తులు, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఈ సంక్షేమ నిధి నుంచి రూ. 50 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 60 సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 33 సహకారం సంఘాల భవనాలను ఆధునికీకరణ చేస్తున్నామని, అందులో భాగంగా మధిర భ్యాంకకు రూ. 10 లక్షలు కేటాయించామన్నారు. రైతులకు జీఓ బ్యాలెన్స్ అకౌండ్‌తో ఖాతాలు తెరచి, ఆరునెలల్లో ఏటీఎం కారుడలు అందజేస్తామన్నారు. అనంతరం ఖమ్మంపాడు సొసైటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ బోజెడ్ల అప్పారావు, మధిర, దెందుకూరు సొసైటీ చైర్మన్లు బిక్కి కృష్ణప్రసాద్, మాదాల శరత్, ఖమ్మంపాడు చిలుకూరు, ఇల్లూరు గ్రామాల సర్పంచ్‌లు మువ్వా వెంకయ్యబాబు, నిడమానూరు జయమ్మ, కోట సుధారాణి, బ్యాంకు మేనేజర్ దిరిశాల ఆనందరావు, సూపర్‌వైజర్ మేదరమెట్ల నాగేశ్వరరావు, సీఈఓలు దొండపాటి వీరభద్రరావు, రామలింగేశ్వరరావు, విప్పా శ్రీనివాసరావు, ఎన్‌వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్‌లో రూ.520కోట్ల వ్యవసాయ రుణాలు
Published Sat, Aug 31 2013 3:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement