ప్రస్తుతం కమ్యూనిటీ హాల్లో పంచాయతీ కార్యాలయం
పాలకోడేరు–ఆకివీడు: అధికారం చేపట్టాలంటే ఆ గ్రామం నుంచి ప్రచారం మొదలు పెట్టాల్సిందే. ప్రభుత్వ పథకాలు మొదలు పెట్టాలంటే ఆ గ్రామంలో అడుగుపెట్టి వెళ్లాల్సిందే. ఇలాంటి సెంటిమెంట్‌తో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు మండలంలో కొండేపూడి గ్రామం ఉంది. ఒకప్పుడు భీమవరం నియోజకవర్గంలో పాలకోడేరు మండలం ఉండేది. అప్పుడు కూడా నాయకులు ఈశాన్యం నుంచి ప్రచారాలు, కార్యక్రమాలు మొదలుపెడితే మంచిదని భావించి కొండేపూడిని ఎంపిక చేసుకునేవారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రతి నాయకుడూ ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పాలకోడేరు మండలం ఉండి నియోజకవర్గంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఈశాన్యం కొండేపూడి గ్రామం కావడంతో ఈ గ్రామం సెంటిమెంట్‌కు ప్రాధాన్యత పెరిగింది. అయితే.. సెంటిమెంట్ గ్రామంలో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉంది. నియోజకవర్గాలు మారినా, నాయకులు మారినా గ్రామంలో సమస్యలు మాత్రం తీరలేదు. గ్రామ సచివాలయం శిథిలమైపోయినా పట్టించుకునే నాథుడే లేడు.
Comments
Please login to add a commentAdd a comment