
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్నాథ్ ఓ ప్లాన్ ప్రకారమే పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలపై దాడులు చేయించారని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కర్నూలు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని అందుకే రాష్ట్ర విభజనకు తమ పార్టీ అధిష్టానం ఓకే అంటోందని పేర్కొన్నారు. సొంత పార్టీ ఎంపీలు పార్లమెంట్ వెల్లోకి వెళ్లడం కాంగ్రెస్ పార్టీకే అవమానం ఆయన అభివర్ణించారు.
విభజనపై సొంతపార్టీ నేతలతో చర్చించడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలకు కానీ ప్రధాని కానీ సమయం ఉండదని, బీజేపీ నేతలతో విందు రాజకీయాలు చేయడానికి మాత్రం సమయం ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షమైన బీజేపీతో విందులు చేయడం శోచనీయమని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.