కుప్పానికి 79 వ ర్యాంకు
స్థానిక నేతల పనితీరుపై సీఎం మం డిపాటు
కుప్పం: రెండేళ్లు పూర్తిచేసుకున్న ఎమ్మెల్యేల పనితీరుపై వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి విడుదల చేసిన ర్యాంకుల్లో కుప్పంకు 79వ స్థానం దక్కింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి 79వ స్థానం దక్కడంపై టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్ అయ్యూరు. సీఎం పనితీరు 79వ స్థానానికి పడిపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.
మందకొడిగా సాగుతున్న అభివృద్ధి పనులు..
రూ.1,450 కోట్ల రూపాయులతో అభివృద్ధి పనులకు గత పర్యటనలో ముఖ్యమంత్రిచంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.269 కోట్లతో సిమెంటు రోడ్లు, బిటి రోడ్లు వేసేందుకు నిధులు వుంజూరయ్యాయి. రూ.50 కోట్లతో నియోజకవర్గంలోని పల్లెల్లో సిమెంటు రోడ్లు వేశారు. ప్రత్యేక కోటా కింద విడుదలైన నిధులను వినియోగించుకోకపోవడంతో అవి వెనక్కువెళ్లాలయి. సీసీ రోడ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రోడ్డు విస్తరణ, భవనాల నిర్మాణం, స్పోర్ట్స్ స్టేడియుం, హార్టికల్చర్ హబ్ లాంటి వివిధ అభివృద్ధి కార్యక్రవూలు ప్రారంభానికి నోచుకో లేదు. టీడీపీ కేడర్ కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదని తేలింది. ఇవన్నీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరును వెన క్కు నెట్టాయి. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ నేతలు సక్రవుంగా పనిచేయుకపోవడంతో వెనుకబడాల్సి వచ్చిందని స్థానికులు అంటున్నారు.
స్థానిక నేతలపై సీఎం ఫైర్..
కుప్పం నియోజకవర్గం రాష్ట్రంలో 79వ స్థానంలో నిలవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక నేతలపై వుండిపడినట్లు తెలిసింది. కోట్ల రూపాయులతో శంకుస్థాపనలు చేసినా ప్రయోజనం లేకపోయిందని, పార్టీ కేడర్ సక్రవుంగా పనిచేయకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన వాపోయినట్లు సమాచారం. అభివృద్ధి కార్యక్రవూలను వేగవంతం చేయించాలని, పార్టీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని హితవుపలికినట్లు తెలిసింది.