సాక్షి, అమరావతి: రుణం తీసుకునే కౌలు రైతులకు బ్యాంకులు సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బుధవారం ఆయన ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కేబినెట్ సమావేశంలో కౌలు రైతుల రుణ పరిమితిపై చర్చించామని తెలిపారు. ఏపీలో అన్ని చోట్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయని వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్ చాలా ఆశాజనకంగా ఉందన్నారు. సాధారణం కన్నా 51 శాతానికి పైగా వర్షం వచ్చిందన్నారు. ఏపీ రిజర్వాయర్లలో కూడా నీటి లభ్యత స్థితి కూడా చాలా బాగుందని పేర్కొన్నారు.(ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు)
గ్రామస్థాయిలో నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపు వల్లే ఈసారి విత్తన సమస్యలు లేవని మంత్రి అన్నారు. చరిత్రలో మొదటిసారిగా పొగాకు కొనుగోళ్లను ప్రారంభించామని చెప్పారు. ఇందుకోసం రూ. 200 కోట్లు కేటాయించేందుకు సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు.(ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ)
Comments
Please login to add a commentAdd a comment